London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

పింఛన్ల జాతర

. సచివాలయ సిబ్బందితో ఇళ్ల వద్దే పంపిణీ
. పెనుమాకలో ముగ్గురికి అందించిన సీఎం చంద్రబాబు
. గొల్లప్రోలులో పవన్‌ కల్యాణ్‌ అందజేత
. పంపిణీలో భాగస్వాములైన మంత్రులు, శాసనసభ్యులు
. 65.18 లక్షల మందికి రూ.4,408 కోట్ల పంపిణీ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ‘ఎన్టీఆర్‌ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం కోలాహలంగా సాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి మంత్రులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులంతా భాగస్వాములవడంతో పండుగ వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్‌ సొమ్మును నెల మొదటిరోజు ఇంటివద్దే లబ్ధిదారులకు అందించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలో పనిచేసిన వలంటీర్ల స్థానంలో లక్షా 20 వేల మంది సచివాలయ సిబ్బందిని వినియోగించింది. ప్రతి ఒక్కరికీ 50 మంది లబ్ధిదారులను కేటాయించారు. అవసరమైతే ఆశా, అంగన్‌వాడీ ఉద్యోగులను కూడా వినియోగించుకోవాలని, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం లోపే సాధ్యమైనంత వరకు ఒక్కరోజులోనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తొలిరోజు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే రెండోరోజు అందజేయాలని సూచించారు. ఆ మేరకు సోమవారం తెల్లవారుజాము నుంచే పెన్షన్‌ సొమ్ము పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్య్సకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్‌ఐవీ బాధితులు, కళాకారులకు గతంలో ఇచ్చే రూ.3 వేల పెన్షన్‌ను రూ.4 వేలకు పెంపు చేసి అందజేశారు. వీటికి తోడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకుగాను మరో రూ.3 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు పంపిణీ చేశారు. దివ్యాంగులకు రూ.3 నుంచి రూ.6 వేలకు పెంచారు. తీవ్రమైన అనారోగ్యంతో వీల్‌ చైర్‌ లేదా మంచానికి పరిమితమైన వారి పెన్షన్‌ను రూ.5 నుంచి ఏకంగా రూ.15 వేలకు పెంపు చేశారు. కిడ్నీ, కాలేయం, తలసేమియా వ్యాధులతో బాధపడేవారికి రూ.5 నుంచి రూ.10 వేలకు పెంచారు. కుష్టువ్యాధి కారణంగా వైకల్యం పొందిన వారికి రూ.6 వేలు అందించారు. ఇలా మొత్తం 28 వర్గాలకు చెందిన 65,18,496 మంది లబ్ధిదారులకుగాను ప్రభుత్వం రూ.4,408 కోట్లు విడుదల చేయగా, ఆ సొమ్ము మొత్తాన్ని లబ్ధిదారులకు నేరుగా సచివాలయ సిబ్బంది అందించారు.
పెనుమాకలో స్వయంగా చంద్రబాబు పంపిణీ
మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో చంద్రబాబు పింఛను పంపిణీలో స్వయంగా పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి మంత్రి నారా లోకేశ్‌, ఇతర అధికారులతో కలిసి పెనుమాక గ్రామంలోని పూరిగుడిసెలో ఉన్న లబ్ధిదారు రాములు ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి… ముగ్గురు లబ్ధిదారులకు స్వయంగా పింఛను అందజేశారు. లబ్ధిదారు ఇంట్లోని నులక మంచంపై కూర్చొని, కుటుంబసభ్యుల ఆర్థిక స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. త్వరలో ఇల్లు నిర్మించి అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారు కుటుంబసభ్యులు ఇచ్చిన టీ తాగారు. కొందరు పేదరికంలోనే పుట్టి…అందులోనే చనిపోతున్నారని, వారి జీవితాలు మారాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దానికి ఏం చేయాలనేదానిపై ఆలోచన చేస్తామన్నారు. పిల్లల్ని బాగా చదివిస్తేనే జీవితాలు బాగుపడతాయని సూచిస్తూ… ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
గొల్లప్రోలులో పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌
పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ గ్రామానికి చెందిన దివ్యాంగురాలు మేడిశెట్టి నాగమణికి పెన్షన్‌ రూ.6 వేలు అందజేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న పింఛనుదారులతో మాట్లాడి…వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసిందని, వాటిని గాడిలో పెట్టే కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. వలంటీర్లు లేకపోతే పనులు కావని, పింఛన్ల పంపిణీ అసాధ్యమని గత ప్రభుత్వంలో ఉన్నవారు చెప్పారని, అలాంటిది ఎన్నికల్లో తాము హామీ ఇచ్చినట్లుగా వలంటీర్లు లేకుండా సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులను ఉపయోగించుకొని పింఛన్ల పంపిణీ చేసి చూపిస్తున్నామని పవన్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img