London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ప్రజల ఆశలు నెరవేరుస్తాం

పెన్షన్‌ దారులకు సీఎం చంద్రబాబు లేఖ
ఎన్నికల్లో హామీ మేరకు రేపట్నుంచి రూ.4 వేల పెన్షన్‌
ప్రభుత్వంపై అదనంగా రూ.819 కోట్లు భారం
28 వర్గాలకు చెందిన 65,18,496 మందికి లబ్ధి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చటమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం పెన్షన్‌ దారులకు బహిరంగ లేఖ రాశారు. ‘మీ అందరి మద్దతుతో రాష్ట్రంలో మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం కొలువుదీరింది. మీ ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తక్షణ కర్తవ్యం. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్‌ను ఒకేసారి రూ.1,000 పెంచాం. ఇకపై రూ.4 వేలు పెన్షన్‌ ఇస్తాం. దివ్యాంగులకు రూ.3 వేలకు పెంచి, ఇకపై రూ.6 వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. మొత్తం 28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పెన్షన్‌ లబ్ధిదారులకు జులై 1వ తేదీ నుంచే పెంచిన పెన్షన్లు ఇంటి వద్ద అందిస్తాం. కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నాం. పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడుతుంది. ఎన్నికల

సమయంలో వికృత రాజకీయాల కోసం ఆనాటి అధికార పక్షం మిమ్మల్ని పెన్షన్‌ విషయంలో ఎంతో క్షోభకు గురిచేసింది. ఆ మూడు నెలలు మీరు పింఛన్‌ అందుకోవడానికి పడిన కష్టాలు చూసి నేను చలించిపోయా. మండుటెండలో, వడగాల్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూశాను. ఏప్రిల్‌ నెల నుంచే పెన్షన్‌ పెంపును వర్తింపచేస్తానని మాటిచ్చాం. ఆ మేరకు ఏప్రిల్‌, మే, జూన్‌కు కూడా పెంపును వర్తింప చేసి మీకు అందిస్తున్నాం. మూడు నెలలకు పెంచిన రూ.3,000, జులై నెల పింఛన్‌ రూ.4,000 కలిపి మొత్తం రూ.7,000 మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నామని సీఎం చంద్రబాబు లేఖలో వివరించారు. సంక్షేమ పాలకుడు, సామాజిక పెన్షన్‌ విధానానికి ఆద్యుడు స్వర్గీయ ఎన్టీఆర్‌ పేరును పెన్షన్ల కార్యక్రమానికి పెట్టామని తెలిపారు. ఎన్టీఆర్‌ భరోసా పేరుతో ఇకపై మీ ఇంటి వద్దకొచ్చి సామాజిక పెన్షన్ల పంపిణీ జరుగుతుందని, పెరిగిన పెన్షన్‌తో మీకు ఆర్థిక స్వావలంబన, భరోసా లభిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా భద్రత మా బాధ్యత. ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం, ఎప్పుడూ మంచి చేయాలని చూసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని చంద్రబాబు కోరారు.
ఉదయం 6 గంటల నుంచే పెన్షన్‌ పంపిణీ : సీఎస్‌
రాష్ట్రంలో జులై 1వ తేదీన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీని ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పింఛన్ల పంపిణీపై శనివారం విజయవాడ సీఎస్‌ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ పింఛన్‌ దారులకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటా పింఛన్ల పంపిణీకి సంబంధించి 4 వేల 399.89 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు. పింఛన్ల పంపిణీకి ఇతర విభాగాల సిబ్బంది సేవలను కూడా వినియోగించుకునేలా జిల్లా కలెక్టర్లు ఎంపీడీవో, మున్సిపల్‌ కమిషనర్లకు తగు ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్‌ కుమార్‌, గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌ ఎం.శివ ప్రసాద్‌ పాల్గొన్నారు. అలాగే వర్చువల్‌గా ఆర్థిక శాఖ కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img