London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ప్రజాస్వామ్యానికి పాతర

మోదీ సర్కారు తీసుకొచ్చిన మూడు కొత్త చట్టాలను ‘భారతదేశ చరిత్రలో అత్యంత క్రూరమైన నేర చట్టాలు’ అని, అధికార దురహంకారంతోనే కేంద్రం ఇలాంటి చట్టాలు తీసుకొచ్చిందని విపక్ష పార్టీల నేతలు, ప్రముఖ న్యాయవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం పార్లమెంటులో 146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేసి…బలవంతంగా ఈ చట్టాలను ఆమోదించిందని, ఈ చట్టాల్లో అనేక తిరోగమన నిబంధనలు ఉన్నాయని విమర్శించారు. అర్ధరాత్రి పోలీసు రాజ్యంతో భారతదేశం మేల్కొంటోందని, న్యాయ శాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని, చాలా విస్తృతమైన పరిణామాలు కలిగి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది అధికార దురంహకార చర్య
కొత్త నేర చట్టాలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత
విపక్ష నేతలు, న్యాయవాదుల నిరసన

న్యూదిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నేర చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టాలు ‘న్యాయ వ్యవస్థను కుప్పకూల్చే పోలీసు రాజ్యం’గా విపక్షాలు, న్యాయనిపుణులు అభివర్ణిస్తున్నారు. మూడు కొత్త నేరాల చట్టాలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. ఈ చట్టాలను వామపక్ష పార్టీల నేతలతో సహా ప్రతిపక్ష నాయకులు, న్యాయవాదులు దుయ్యబడుతున్నారు. ఇవి ప్రజాస్వామ్య వ్యవస్థను పాతరేసేలా, ప్రజల హక్కులను హరించేలా ఉన్నాయని ధ్వజమెత్తుతున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి.రాజా, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, కాంగ్రెస్‌ నేతలు పి.చిదంబరం, మనీశ్‌ తివారి, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయ తదితరులు నేర న్యాయ వ్యవస్థలో వచ్చిన మార్పులపై స్పందించారు. కొత్త నేరచట్టాలు, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జులై 1 సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. దిల్లీ పోలీసులు ఒక హాకర్‌పై తొలి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇదిలాఉండగా, ఈ చట్టాలు భారతీయులచే, వారి కోసం సృష్టించబడినవని, వలసవాద గతం నుంచి వైదొలగడానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రభుత్వం చెప్పుకొస్తోంది. 140 మంది ఎంపీలు సస్పెండ్‌ అయినప్పుడు పార్లమెంటు ఆమోదించిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన కొన్ని స్వరాలు ఇక్కడ ఉన్నాయి. అనేక మంది రాజకీయ నాయకులు, న్యాయవాదులు కొత్త చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడారు.
పార్లమెంటులో లేవనెత్తుతాం: డి.రాజా
సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సోమవారం కొత్త నేర చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశాన్ని విపక్ష పార్టీలు పార్లమెంటులో లేవనెత్తుతాయని స్పష్టం చేశారు. బార్‌ కౌన్సిల్‌లు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిరసనలను ఆయన ప్రస్తావించారు. ‘ఈ మూడు కొత్త నేర చట్టాలను మా పార్టీ వ్యతిరేకిస్తోంది. వీటిని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు తీవ్ర నిరసన, ప్రతిఘటన ఎదురయ్యాయి. బార్‌ కౌన్సిల్స్‌, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకించాయి. అయినప్పటికీ, దీనిని ఆచరణలో పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోంది. మన ప్రజాస్వామ్య ఆచరణకు, పార్లమెంటరీ సమావేశాలకు అనుగుణంగా లేదు. వీటి అమలును వాయిదా వేయాలి. ఇది మా పార్టీ అభిప్రాయం. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తాయి’ అని ఆయన ఒక ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు.
‘బుల్డోజర్‌ న్యాయ వ్యవస్థ’ను అనుమతించం: ఖడ్గే
మూడు కొత్త నేర చట్టాల అమలుపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే మండిపడ్డారు. ఎన్నికలలో రాజకీయంగా, నైతికంగా ఎదురుదెబ్బతిన్న మోదీజీ, బీజేపీ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నటిస్తున్నారు. కానీ నేటి నుంచి అమలవుతున్న మూడు నేర చట్టాలను పార్లమెంటులో 146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేస్తూ బలవంతంగా ఆమోదించారనేది వాస్తవం. ఇండియా ఐక్య సంఘటన ఇకపై ఈ ‘బుల్డోజర్‌ జస్టిస్‌’ ను పార్లమెంటరీ వ్యవస్థలో అమలు చేయడానికి అనుమతించదు’ అని స్పష్టం చేశారు.
దేశం ‘పోలీసు రాజ్యం’తో మేల్కొంది: ఇందిరా జైసింగ్‌
మూడు కొత్త నేర చట్టాలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలు కావడానికి కొన్ని నిమిషాల ముందు సుప్రీం కోర్టు ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌ చేశారు. ‘అర్ధరాత్రి వేళ భారతదేశం స్వాతంత్య్రం కోసం మేల్కొంటుంది’ అన్న పండిట్‌ నెహ్రూ ప్రసంగం నాకు గుర్తుకు వస్తోంది. జులై 1, 2024 అర్ధరాత్రి పోలీసు రాజ్యంతో భారతదేశం మేల్కొంటోంది’ అని ఆమె పేర్కొన్నారు.
ప్రాథమికంగా కొన్ని మార్పులు రాజ్యాంగ విరుద్ధం: పి.చిదంబరం
ప్రభుత్వం తగిన చర్చ లేకుండా కొత్త క్రిమినల్‌ చట్టాలను ‘బుల్డోజ్‌’ చేసిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఆయన ఒక పోస్ట్‌ చేశారు. ‘కొత్త నేర చట్టాలు అని పిలవబడే వాటిలో 90 నుంచి 99 శాతం కట్‌, కాపీ, పేస్ట్‌ పని. ఇప్పటికే ఉన్న మూడు చట్టాలకు కొన్ని సవరణలతో పూర్తి చేయగలిగే పని వృధా కసరత్తుగా మారింది. అవును, కొత్త చట్టాలలో కొన్ని మెరుగుదలలు ఉన్నాయి. మేము వాటిని స్వాగతించాం. వాటిని సవరణలుగా ప్రవేశపెట్టవచ్చు. మరోవైపు, అనేక తిరోగమన నిబంధనలు ఉన్నాయి. కొన్ని మార్పులు ప్రాథమికంగా రాజ్యాంగ విరుద్ధం’ అని ఆయన పేర్కొన్నారు.
న్యాయశాస్త్ర ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం: సౌగతా రాయ్‌
పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) కి చెందిన లోక్‌సభ సభ్యుడు సౌగతా రాయ్‌ స్పందిస్తూ, ‘చట్టాల అమలును వాయిదా వేయాలని మమతా బెనర్జీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రధాన అభ్యంతరాలలో ఒకటి, ప్రజల పోలీసు కస్టడీని పొడిగించే అధికారం పోలీసులకు ఉంది. ఇది కస్టోడియల్‌ న్యాయ శాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం. చట్టంలో ఇంకా పూర్తిగా అమలు చేయని ఇతర నిబంధనలు అనేకం ఉన్నాయి. పెళ్లికి సంబంధించిన తప్పుడు వాగ్దానం, మైనర్లపై సామూహిక అత్యాచారం, మూక దాడులకు వ్యతిరేకంగా నిబంధన ఖరారు కాలేదు. దేశద్రోహ చట్టాన్ని అమలు చేయలేదు. ఇది తీవ్ర అభ్యంతరకరం’ అని తెలిపారు.
పార్లమెంటు పున:పరిశీలించాలి: మనీశ్‌ తివారి
‘జులై 1, 2024 అర్థరాత్రి 12 నుంచి అమలులోకి వచ్చిన కొత్త నేర చట్టాలు ఈ రోజు భారతదేశాన్ని పోలీసు రాజ్యంగా మార్చడానికి పునాదులు వేసింది. వాటి అమలును తక్షణమే నిలిపివేయాలి. పార్లమెంటు వాటిని పునఃపరిశీలించాలి’ అని కాంగ్రెస్‌ నేత మనీశ్‌ తివారీ ‘ఎక్స్‌’ లో చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇది కేవలం అధికార దురంహకారం: కామినీ జైస్వాల్‌
ప్రముఖ న్యాయవాది కామినీ జైస్వాల్‌ కొత్త నేర చట్టాలను విమర్శించారు. వాటిని వినాశకరమైనవిగా పేర్కొంటూ వాటి ప్రయోజనాలను ప్రశ్నించారు. ఆమె పీటీఐతో మాట్లాడుతూ ‘ఇది ఒక విపత్తు అని నేను భావిస్తున్నాను. సామాన్యులకు కాదు, న్యాయవాదులకు కాదు, దర్యాప్తు సంస్థలకు కాదు, ఎవరికీ ప్రయోజనం లేదు, ప్రభుత్వం ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుంటే నిరుద్యోగానికి ఎలా సహాయపడుతుందో నాకు అర్థం కాలేదు. మనం చాలా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నాం. సీఆర్‌పీసీ 2013లో సవరించబడిరది. వారు ఏమి చూపించడానికి ప్రయత్నిస్తున్నారు? ఇది కేవలం అధికార దురహంకారం మాత్రమే. హిందీ రాని వారి పరిస్థితి ఏమవుతుంది. పాత పదాలనే ఉపయోగిస్తామని న్యాయమూర్తులు చెబుతున్నారు. స్థానిక కోర్టులలో, స్థానిక భాష ఉపయోగిస్తారు. న్యాయం జరగడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది’ అని తెలిపారు.
కొత్తగా జేపీసీకి సూచించండి: రాఘవ్‌ చద్దా
కొత్త నేర చట్టాలను సమీక్షించాలని, వాటిని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలని ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా కోరారు. ‘ఆమ్‌ ఆద్మీ పార్టీ మొదటి నుంచి దానిని సమీక్షించాలని అభిప్రాయపడిరది. దానిని జేపీసీకి సూచించాలి. తొందరపాటుతో అమలు చేయకూడదు. ఇది చాలా విస్తృతమైన పరిణామాలను కలిగి ఉంటుంది’ అని తెలిపారు.
అత్యంత క్రూరమైన చట్టాలు: జవహర్‌ సిర్కార్‌
మూడు కొత్త చట్టాలను ‘భారతదేశ చరిత్రలో అత్యంత క్రూరమైన నేర చట్టాలు’ అని, ‘పార్లమెంటులో చర్చ లేకుండా ఆమోదించబడినవి’ అని తృణమూల్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ జవహర్‌ సిర్కార్‌ పేర్కొన్నారు. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 172 (2) ప్రకారం, పోలీసులు వారెంట్‌ లేకుండా అరెస్టు చేయవచ్చని ఆయన అన్నారు. బీఎన్‌ఎస్‌ఎస్‌ (కొత్త సీఆర్‌పీసీ) సెక్షన్‌ 187 (2) మీరు 24 గంటలు కాకుండా 90 రోజులు పోలీసు కస్టడీలో ఉండవచ్చని చెబుతుందన్నారు. బీఎన్‌ఎస్‌ (పాత ఐపీసీ) సెక్షన్‌ 111(1) మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్రాసినా లేదా మాట్లాడినా… మీరు తీవ్రవాది! అని పేర్కొంటోంది. ‘సెక్షన్‌ 197 ఏదైనా సమాచారం ‘తప్పుడు’ లేదా ‘తప్పుదోవ పట్టించేది’గా పరిగణించబడుతుంది. అందువల్ల మీరు నేరస్తులు’. ‘సెక్షన్‌ 150, అలాగే 152 ప్రకారం, మీ ప్రజాస్వామ్య హక్కు ‘భారత సార్వభౌమత్వాన్ని’ ప్రభావితం చేయగలదని భావిస్తే ప్రభుత్వం మిమ్మల్ని నేరస్తునిగా పరిగణించవచ్చు. అది బీజేపీకి ఏమైనా అర్ధం అవుతుంది’ అని ఆయన ‘ఎక్స్‌’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రధాన మంత్రి మైనార్టీలపై ద్వేషాన్ని రెచ్చగొట్టినప్పుడు అది సరే… ఈ కొత్త నేర చట్టాల అమలు వల్ల మీరు మతాలకు వ్యతిరేకంగా ఏ వ్యాఖ్య చేసినా జైలు శిక్ష అనుభవించవచ్చు’ అని అన్నారు.

దిల్లీలో వీధి వ్యాపారిపై తొలి వేటు
న్యూదిల్లీ: మోదీ సర్కారు తీసుకొచ్చిన ఆటవిక నేర న్యాయచట్టాలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియమ్‌(బీఎస్‌ఏ) ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో భారతీయ న్యాయ సంహిత కింద తొలి కేసు నమోదైంది. న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌ పరిధిలోని ఓ వీధి వ్యాపారిపై కొత్త క్రిమినల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 285 కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దేశ రాజధానిలో ఒక వీధి వ్యాపారి రోడ్డుపై వాటర్‌ బాటిళ్లు, గుట్కా, బీడీ, సిగరెట్లు అమ్మడాన్ని పెట్రోలింగ్‌ పోలీసులు గుర్తించారు. అతడి తాత్కాలిక దుకాణం ఎన్‌డీఆర్‌ఎస్‌ సమీపంలోని ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ కింద ఉంది. దానివల్ల రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దాంతో దానిని వేరేచోటుకు తరలించమని అతడికి పోలీసులు చాలామార్లు చెప్పినా వినలేదు. దానివల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను వీడియో తీసి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆ వీధి వ్యాపారిని బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img