Thursday, October 24, 2024
Thursday, October 24, 2024

‘మహా’ సీట్ల సర్దుబాటు కొలిక్కి

. 85 సీట్లు చొప్పున పోటీకి శివసేన (యూబీటీ), కాంగ్రెస్‌, ఎన్సీపీ (ఎస్‌పీ) నిర్ణయం
. 270 సీట్లపై కుదిరిన ఏకాభిప్రాయం
. కూటమి నేతల వెల్లడి

ముంబై : మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో సీట్ల పంపకంపై స్పష్టత వచ్చింది. కూటమిలోని మూడు ప్రధాన పార్టీలు 85 సీట్ల చొప్పున పంచుకు న్నాయి. ఈ మేరకు కూటమి నేతలు బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. ఈ కూటమిలోని ప్రధాన భాగస్వామి పక్షాలైన శివసేన (యూబీటీ), కాంగ్రెస్‌, ఎన్సీపీ (ఎస్‌పీ) పార్టీలు 85 స్థానాల్లో చొప్పున పోటీచేయాలని నిర్ణయించాయి. 270 సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరగా… మరో 18 స్థానాలను సమాజ్‌వాదీ పార్టీ సహా ఇతర భాగస్వామ్యపక్షాలకు ఇచ్చేందుకు చర్చిస్తు న్నట్లు కాంగ్రెస్‌ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే వెల్లడిరచారు. ఈ మేరకు ఆయన శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌, ఇతర నేతలతో కలిసి ముంబైలో మీడియాతో మాట్లాడారు. మొత్తం 288 సీట్లకు గాను 270 సీట్లపై సామరస్యపూర్వకంగా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. అయితే, సీట్ల పంపకాలపై తుది ఒప్పందానికి సంబంధించిన చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు చెప్పారు. దీనిపై సమాజ్‌వాదీ పార్టీతో పాటు కూటమిలోని ఇతర పార్టీలతో చర్చలు జరిపి.. గురువారం నాటికి అంతా పూర్తి చేస్తామని తెలిపారు. తామంతా మహా వికాస్‌ అఘాడీ కూటమిగా పోటీ చేస్తున్నామని… ఎన్నికల్లో ‘మహాయుతి కూటమి’పై విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా.. సీట్ల సర్దుబాటులో జరుగుతోన్న జాప్యం పట్ల చిన్న పార్టీలు గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడిరది. సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌, లెఫ్ట్‌, పీడబ్ల్యూపీలు కూటమిలో ఉన్నాయి. 12 సీట్లు ఆశిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటికే ఐదు చోట్ల అభ్యర్థులను ప్రకటించింది.
65 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించిన ఉద్ధవ్‌
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు శివసేన (యూబీటీ) అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మొత్తం 65మందితో జాబితాను విడుదల చేసింది. ముంబైలోని వర్లి నుంచి మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే పోటీ చేయనున్నారు.
బీజేపీ తొలి జాబితా విడుదల
మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను 99 మందితో బీజేపీ మొదటి జాబితా విడుదల చేసింది. వీరిలో 71 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. ఇందులో ఇటీవలే కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన అశోక్‌ చవాన్‌ కుమార్తె శ్రీజయ చవాన్‌కు చోటు దక్కింది. ఇంకా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బవాంకులె, అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌, మంత్రులు గిరీశ్‌ మహాజన్‌, సుధీర్‌ ముంగంటివార్‌, చంద్రకాంత్‌ పాటిల్‌ వంటి ప్రముఖులు ఉన్నారు.
జాబితాలో మొత్తం 13 మహిళల పేర్లున్నాయి. చించ్వాడ్‌, కల్యాణ్‌ ఈస్ట్‌, శ్రీగొండ స్థానాల్లో మాత్రం సిట్టింగ్‌లకు బదులు కొత్త వారికి అవకాశమిచ్చింది. ముంబైలోని పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేల్లో 14 మందిని మళ్లీ నామినేట్‌ చేసింది. సుమారు 150 సీట్లలో పోటీ చేసేందుకు మిత్రపక్షాలతో బీజేపీ మంతనాలు సాగిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img