Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మెగా డీఎస్సీపైనేతొలి సంతకం

సిలికా పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ సమస్య అధిగమిస్తాం
గూడూరు సభలో చంద్రబాబు

విశాలాంధ్ర`గూడూరు : పేదరికం లేని ఆంధ్ర ప్రదేశ్‌ నిర్మాణమే జీవిత ఆశయమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం గూడూరు పట్టణంలోని సీఆర్‌ రెడ్డి కల్యాణ మండపం ప్రాంగణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో సృష్టిస్తున్న సంపదతో జగన్‌మోహన్‌ రెడ్డి, కొంతమంది మాత్రమే కోట్లకు పడగలెత్తుతున్నారని ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పిన జగన్‌ ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదన్నారు. డీఎస్సీ పేరుతో నిరుద్యోగ ఉపాధ్యాయులను మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే పెడతామన్నారు. ప్రతి ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని, నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.3 వేలు అందిస్తామన్నారు. ఈ ప్రాంతంలో సిలికా సంబంధిత పరిశ్రమలను నెలకొల్పి ఉద్యోగ, ఉపాధి కల్పనకు శ్రీకారం చుడతామన్నారు. ఈ ప్రాంతంలో భూగర్భ ఖనిజాలను, సిలికా, ఇసుక, చివరకు కొండలను చదును చేసేస్తూ వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, సిలికా, క్వార్జ్ట్‌, ఇసుక, మద్యం తయారీ, భూములపై జగన్‌దే పెత్తనమన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1,500 అందిస్తామన్నారు. ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం కింద ఒక్కో బిడ్డ చదువుకు 15 వేల రూపాయలు అందిస్తామని, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు బస్సులలో ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తామన్నారు. రైతు కూలీలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి రైతుకు ఏడాదికి రూ.25 వేలు అందిస్తామన్నారు. వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేల పింఛన్‌ అందిస్తామన్నారు. వలంటీర్లకు రూ.12 వేలు జీతం ఇస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే గూడూరును యథాతథంగా నెల్లూరు జిల్లాలోనే చేరుస్తామని ప్రకటించారు. ఎంపీ అభ్యర్థి వరప్రసాద్‌ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి పాశిం సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి చంద్రబాబులాంటి విజన్‌ ఉన్న నాయకుడి అవసరం ఉందన్నారు. సైకిల్‌, కమలం గుర్తులకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఆరుగురితో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు భారీ కేక్‌ కట్‌ చేసి నాయకులందరికీ పంచిపెట్టారు. సీఆర్‌ రెడ్డి కల్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కీరణ్‌ కుమార్‌ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త గంగా ప్రసాద్‌, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు నెలవల సుబ్రమణ్యం, పరసారత్నం, కురుగొండ్ల రామకృష్ణ, పనబాక కృష్ణయ్య, పాశిం సంధ్యారాణి, చక్రాల ఉష, గుండాల లీలావతి, మట్టం శ్రావణి, సునీత, శ్రీదేవి, భారతి, శివ కుమార్‌, బీజేపీ నాయకులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, బాలకృష్ణంనాయుడు, జనసేన నాయకులు తీగల చంద్రశేఖర్‌, పేటేటి చంద్రనీల్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img