London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

మోదీ నైతిక ఓటమి

. బలం పుంజుకున్న ప్రతిపక్షాలు
. సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో నారాయణ

విశాలాంధ్ర-విశాఖ: లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని గొప్పలకు పోయిన ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలు 240 స్థానాలకు పరిమితం చేసి బుద్ధి చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. విశాఖ మురళీనగర్‌లోని ఆహ్వాన ఫంక్షన్‌ హాల్‌లో సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీజేపీ పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి వెల్లడైందని, రామమందిరాన్ని నిర్మించిన అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయిందని చెప్పారు. బీజేపీికి ఓట్లు, సీట్లు తగ్గాయని, నరేంద్ర మోదీ నైతికంగా ఓడిపోయి సాంకేతికంగా గెలిచారన్నారు. తెలుగుదేశం పార్టీ, జేడీయూతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరదని తెలిపారు. గత ఎన్నికల హామీలు అమలు చేయలేదని, నోట్ల రద్దు ద్వారా బ్లాక్‌మనీ వైట్‌గా మారిందని, ఈ ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలను ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుందని, అదంతా నల్లధనమేనని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం 16 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్‌ రుణాలు మాఫీ చేసిందని, కొంతమంది వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారని, అందులో విజయ్‌ మాల్యా తప్ప మిగతా అందరూ గుజరాత్‌కి చెందిన వారేనని, అందులో కొందరు మోదీ ఇంటిపేరు వారని నారాయణ తెలిపారు. ప్రధాని మోదీ సన్నిహితుడు అదానీ డ్రగ్‌ స్మగ్లర్‌ అని, మోదీ అండతో అదానీ దేశంలోని అన్ని పోర్టులు లాక్కుంటున్నాడని విమర్శించారు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశం ప్రత్యేకత అని, దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తికి ప్రధాని మోదీ తూట్లు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. ఈసారి పార్లమెంటులో బలమైన ప్రతిపక్షం ఏర్పడిరదని చెప్పారు. గతంలో ప్రతిపక్షాన్ని బయటకు పంపి ఆమోదించిన క్రిమినల్‌ చట్టాలను జులై 1 నుంచి అమలు చేస్తున్నారని, దీనిపై చర్చిద్దామని ప్రతిపక్షాలు చెబుతున్నా మోదీ పట్టించుకోలేదని, కొత్త నేర చట్టాలు ప్రమాదకరమైనవని పేర్కొన్నారు. కార్మికవర్గంపై కఠిన చర్యలు, యాజమాన్యాలపై కనీస చర్యలు ఇందులో ఉన్నాయని, జరిమానాలు, జైలు శిక్షలు పెంచారని అన్నారు. ప్రధాని మోదీ రోజుకు మూడు డ్రస్సులు మారుస్తూ… విలాసవంతమైన విమానంలో ప్రయాణిస్తూ పైకి సన్యాసి అని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఫ్యాషన్‌ షో పెడితే మోదీకే మొదటి స్థానం వస్తుందన్నారు. గెలిచిన అభ్యర్థులు పార్టీలు ఫిరాయించటం సరైనది కాదని, పదవులకు రాజీనామా చేసి పార్టీలు మారాలని నారాయణ సూచించారు. గత ఐదేళ్లలో కక్ష సాధింపు చర్యలు, అప్రజాస్వామిక పాలన వల్ల జగన్‌ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని అన్నారు. చేసిన తప్పులు తెలుసుకొని ప్రజలకు జగన్‌ క్షమాపణ చెప్పాలని, తప్పులు సమర్థించుకుంటే అది మరో తప్పు కిందకే వస్తుందన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో తప్పులు చేసిన వారి సంగతి చట్టపరంగా తేల్చాల్సిందేనని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను చంద్రబాబు ఆపి చూపించాలని, ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితుల ప్రయోజనాలకే సీపీఐ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ డైనమిక్‌ పాత్ర పోషించారని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా గట్టి ప్రయత్నం చేశారని అన్నారు. అంతకుముందు సీపీఐ పతాకాన్ని పార్టీ సీనియర్‌ నాయకులు మానం ఆంజనేయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు విప్లవ గీతాలు ఆలపించారు. సంతాప తీర్మానాన్ని పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి ప్రవేశపెట్టారు. సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు అధ్యక్షత వహించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img