London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్‌

. ఖడ్గేను మాట్లాడనివ్వాలని డిమాండ్‌ బ అంగీకరించని చైర్మన్‌
. మోదీ ప్రసంగాన్ని బహిష్కరించిన ఇండియా ఎంపీలు: బీజేడీ మద్దతు

న్యూదిల్లీ: ‘అబద్ధాలు ఆపండి, ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వండి’ అన్న నినాదాలతో రాజ్యసభ దద్దరిల్లింది. ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రతి పక్షాలు బహిష్కరించాయి. కాంగ్రెస్‌పై విమర్శల దాడిని తీవ్రంగా ఖండిరచాయి. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానంపై కృతజ్ఞతా తీర్మానానికి స్పందిస్తూ గత కాంగ్రెస్‌ పాలన, ఎమర్జెన్సీ, మాజీ అధినేత్రి సోనియాగాంధీపై మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో మోదీ ప్రసంగానికి వ్యతిరేకంగా ఇండియా ఐక్య సంఘటన ఎంపీలు నినాదాలి చ్చారు. ప్రధాని తన తీరు మార్చుకోకుండా విమర్శల వర్షాన్ని కురిపించడంతో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖడ్గేను జోక్యం చేసుకునేందుకు అవకాశమివ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ‘ఎల్‌ఓపీని మాట్లాడనివ్వండి’ అని ఎంపీలు నినాదాలు చేశారు. ఖడ్గే కూడా తనను మాట్లాడనివ్వాలని చైర్మన్‌ను కోరారు. ‘మా అభిప్రాయాన్ని చెప్పనివ్వండి’ అని అన్నారు. కానీ సభాపతి ఒప్పుకోలేదు. దీంతో ‘అబద్ధాలు చెప్పడం ఆపండి. సిగ్గు సిగ్గు’ అంటూ మోదీని ఉద్దేశించి ఇండియా ఐక్య సంఘటన ఎంపీలు నినదించారు. సభలో గందరగోళం నెలకొన్నా మోదీ మాట్లాడటం ఆపలేదు. ఖడ్గేకు మాట్లాడే అవకాశాన్ని సభాపతి ఇవ్వలేదు. దీంతో ‘ఇండియా’ ఎంపీలంతా వాకౌట్‌ చేశారు. బీజేపీ మిత్రపక్షమైన బీజేడీ కూడా మద్దతిచ్చింది. అంతకుముందు మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ను పరాన్నజీవితో పోల్చారు. మిత్రపక్షాలను మింగేస్తుందని ఆరోపించారు. మణిపూర్‌ అంశాన్ని రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి సోనియాగాంధీని విమర్శించారు. కాంగ్రెస్‌ అధ్వర్యంలో రిమోట్‌ కంట్రోల్‌ పాలన సాగిందని వ్యాఖ్యానించారు. ‘దేశం దానంటత అదే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోందని నమ్మే మేధావులు కొందరు ఇక్కడ ఉన్నారు. వీరు గతంలో ఆటో పైలట్‌/ రిమోట్‌`పైలట్‌ ప్రభుత్వాలు నడిపారు’ అని విమర్శించారు. కాంగ్రెస్‌తో రాజ్యాంగానికి అతిపెద్ద ముప్పు అన్నారు. గతం గతహా అని ఎమెర్జెన్సీ ఉద్దేశించి కాంగ్రెస్‌ అంటోందని కానీ ఆ పార్టీ చేసిన పాపాలు… కాలంతో పాటు తుడిచిపెట్టుకుపోయాయా అని మోదీ వ్యాఖ్యానించారు. తప్పు జరిగిన ప్రతిసారీ కాంగ్రెస్‌లోని దళితుడు లేక ఓబీసీపై దాని ప్రభావం ఉంటుందన్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసికూడా 2017లో మీరా కూమార్‌ను నిలబెట్టిందని విమర్శించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, తొలి దళిత మహిళ రాష్ట్రపతిని కాంగ్రెస్‌ విమర్శించిందని మోదీ ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img