Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Monday, September 30, 2024
Monday, September 30, 2024

సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న

. ఆర్థికశాఖకు వినయ్‌చంద్‌
. ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌
. శ్రీలక్ష్మీ, రజిత్‌ భార్గవ్‌, ప్రవీణ్‌ ప్రకాశ్‌కు షాక్‌
. జీఏడీకి అటాచ్‌ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
. సౌరభ్‌గౌర్‌, కోన శశిధర్‌, ప్రవీణ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు
. ఏపీలో ఐఏఎస్‌ బదిలీలు`సీనియర్లకు కీలక శాఖలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికార యంత్రాంగంలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేశారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రక్షాళన గురించి పదేపదే చెప్పారు. సీనియర్‌ అధికారులకు కీలక శాఖలు అప్పగించారు. సీనియర్‌ ఐఏఎస్‌ వై.శ్రీలక్ష్మీ, రజిత్‌ భార్గవ్‌, ప్రవీణ్‌ ప్రకాశ్‌ను జీఏడీకి అటాచ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీజేసింది. జగన్‌ సర్కారులో పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మీ, ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజిత్‌ భార్గవ్‌, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్‌ ప్రకాశ్‌ బాధ్యతలు నిర్వహించారు. చంద్రబాబు బాధ్యతల స్వీకరణ సమయంలోనూ ఈ అధికారులు నిరాదరణకు గురయ్యారు. ఐఏఎస్‌ అధికారి మురళీధర్‌రెడ్డిని జేఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు.
ముఖ్యమైన శాఖలకు సమర్థులను కేటాయించగా, మరికొందరు ఐఏఎస్‌లకు అదనపు శాఖల బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రద్యుమ్న, ఆర్థికశాఖ కార్యదర్శిగా వి.వినయ్‌చంద్‌, ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌ తదితర అధికారులను నియమించారు. సీనియర్‌ ఐఏఎస్‌లు సౌరభ్‌గౌర్‌, కోన శశిధర్‌, ప్రవీణ్‌కుమార్‌కు అదనపు శాఖల బాధ్యతలు కేటాయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img