Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

సీఏఏ అమలుపై సుప్రీంకోర్టులో సవాల్.. పిటిషన్ వేసిన ఐఎంయూఎల్

మోదీ సర్కారు వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీచేయడాన్ని ముస్లిం సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సర్వోన్నత న్యాయస్థానంలో ఇండియన్ యూనియన్ ముస్లిమ్ లీగ్ (ఐయూఎంఎల్) పిటిషన్ వేసింది. సీఏఏ అమలును తక్షణమే నిలిపివేయాలని, ఇది రాజ్యాంగ విరుద్దమైందని, ముస్లిం సమాజం పట్ల వివక్షతను చూపుతుందని పేర్కొన్నారు. డిసెంబరు 31, 2014లోపు బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని కల్పించే సవరణ బిల్లును 2019లో పార్లమెంట్ ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది. దీని ప్రకారం ఆ దేశాల్లో మైనార్టీలైన హిందూ, సిక్కు, పార్శీ, బౌద్ధ, జైన్, క్రైస్తవులకు భారత పౌరసత్వం లభిస్తుంది. అయితే, ఈ సవరణ చట్టాన్ని 2019లో సవాల్ చేసిన పార్టీల్లో ఐయూఎంఎల్ ఒకటి. ఈ చట్టంలో ముస్లింలను చేర్చలేదని, రాజ్యాంగంలోని సమానత్వపు హక్కు కల్పించే ఆర్టికల్ 14‌కు విరుద్దమని వాదించింది. ఇంతకుముందు చట్టం అమలను నిలిపివేయాలని Iఖవీూ కోరింది. అయితే, ఇంకా నిబంధనలను నోటిఫై చేయనందున చట్టం అమలులోకి రాదని కోర్టుకు కేంద్రం తెలిపింది.చట్టం రాజ్యాంగ చెల్లుబాటుకు వ్యతిరేకంగా పెండింగ్‌లో ఉన్న 250 పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు సీఏఏ అమలును నిలిపివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగ పీఠిక భారత్ లౌకిక దేశమని, అందువల్ల ఆమోదించిన ఏదైనా చట్టం మతానికి-తటస్థంగా ఉండాలని పిటిషన్‌లో పేర్కొంది.సీఏఏ అమలుపై సోమవారం సాయంత్రం కేంద్రం ప్రకటనతో దేశంలోని పలు ప్రాంతాల్లో వేడుకలు, నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ప్రకటన తర్వాత బెంగాల్‌లోని మతువా కమ్యూనిటీ సభ్యులు, భోపాల్‌లో నివసిస్తున్న సింధీ శరణార్థులు వేడుకలు నిర్వహించారు. అయితే మరికొన్ని ప్రాంతాల్లో ప్రజలు భిన్నంగా స్పందించారు. సరిహద్దు రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున వలసలకు దారితీస్తుందనే కారణంతో సీఏఏను వ్యతిరేకిస్తూ అసోంలో నిరసనలు చెలరేగాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో, ముస్లిం సమాజంపై చట్టం వివక్ష చూపుతుందని నిరసనకారులు ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈ చట్టాన్ని అమలు చేస్తుండటంతో అధికార బీజేపీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అసోం, పశ్చిమ బెంగాల్‌లో ఓటర్లను చీల్చడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. ాబిల్లును డిసెంబరు 2019లో ఆమోదించిన సర్కారు.. మూడు నుంచి ఆరు నెలల్లో అమలు చేయాలి.. కానీ, 4 సంవత్సరాల మూడు నెలలు తీసుకుంది.. ఈ కాలంలో సుప్రీంకోర్టు నుంచి మోదీ ప్రభుత్వం తొమ్మిది సార్లు పొడిగింపు కోరింది.. గత రాత్రి నిబంధనలను విడుదల చేసింది్ణ అని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img