Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కలిసే ఉన్నాం

. కూటమికి ఢోకా లేదు
. 63 స్థానాల్లో ఎస్పీ 17 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ
. యూపీలో సీట్ల సర్దుబాటు ఖరారు
]. ప్రియాంకసోనియా జోక్యంతో తొలగిన ప్రతిష్ఠంభన

న్యూదిల్లీ/లక్నో:
‘కాంగ్రెస్‌తో కలిసే ఉన్నాం. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కూటమి పటిష్ఠమ’ని సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ స్పష్టంచేశారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు ముగిసినట్లు తెలిపారు. ఏకాభిప్రాయం కుదిరిందని, కలిసి ముందుకెళతామని వెల్లడిరచారు. 80 లోక్‌సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ 17 స్థానాల నుంచి పోటీ చేస్తుందని, ఎస్పీ 63 స్థానాల్లో పోటీ చేస్తుందని రెండు పార్టీలు బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించాయి. అంతకుముందు అఖిలేశ్‌ యాదవ్‌ మొరాదాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌ నుంచి పోటీ చేసే స్థానాలపై ప్రతిష్ఠంభన తొలగిందని, తమ సఖ్యతకు ఢోకా లేదని అఖిలేశ్‌ చెప్పారు. సీట్ల సర్దుబాటు ముగియడంతో భారత్‌ జోడో న్యాయ యాత్రలోనూ పాల్గొనబోతున్నట్లు తెలిపారు. ‘ముగింపు బాగుంటే అంతా బాగున్నట్లే’ అని అఖిలేశ్‌ చిరునవ్వు చిందించారు. ‘అవును, మా కూటమి బలంగా ఉంది. మా మధ్య ఎలాంటి ఘర్షణలుగానీ విభేదాలుగానీ లేవు. అన్ని విషయాల్లో స్పష్టంగా ఉన్నాం’ అని అఖిలేశ్‌ తెలిపారు. ఎస్పీ 62 స్థానాల్లో పోటీ చేస్తుందని, కాంగ్రెస్‌ కోసం 17 స్థానాలు రిజర్వు చేయగా చంద్రశేఖర్‌ ఆజాద్‌కు చెందిన ఆజాద్‌ సమాజ్‌ పార్టీకి ఒక్క స్థానం వదిలిపెట్టినట్లు సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా రంగ ప్రవేశంతో ఈ సమస్య పరిష్కారమైంది. ఆమె బుధవారం అఖిలేశ్‌ యాదవ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని సీట్ల సర్దుబాటుపై ప్రతిష్ఠంభన కొనసాగించవద్దని, కూటమికి తుది రూపమివ్వాలని కోరారు. సోనియాగాంధీ కూడా కొన్ని సూచనలు చేసిన దృష్ట్యా సీట్ల సర్దుబాటు కొలిక్కి రాగలిగింది. ఒక్క శ్రావస్తీ స్థానం మినహా అన్ని స్థానాలకు రెండు పార్టీలు అంగీకరించినట్లు ఎస్పీ, కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. తొలుత మొరాదాబాద్‌తో సహా 19 స్థానాలను కాంగ్రెస్‌ కోరింది. అయితే చర్చల్లో భాగంగా మోరాదాబాద్‌ను వదులుకున్నది. ప్రధాని మోదీ నియోజకవర్గమైన వారణాసి కోసం పట్టుబడిన ఎస్పీ ఆ డిమాండ్‌పై వెనక్కు తగ్గింది. సీతాపూర్‌, హత్రాస్‌ స్థానాలను ఈ పార్టీ పరస్పరం మార్చుకునే అవకాశముంది. శ్రావస్తీ స్థానానికి బదులు మధురా లేక బులంద్‌షెహర్‌ను ఎంచుకోవాలని ఎస్పీకి సూచించారు. ఏదిఏమైనా సీట్ల సర్దుబాటుపై గురువారం అధికారిక ప్రకటన వెలువడుతుందని రెండు పార్టీల వర్గాలు వెల్లడిరచాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అవినాష్‌ పాండే మాట్లాడుతూ ‘కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ఆమోదం కోసం వేచివున్నాం. కూటమి ప్రయోజనాల దృష్ట్యా కొన్ని స్థానాల్లో మార్పునకు అంగీకరించాం’ అని అన్నారు. ఇదిలావుంటే గెలుపు అవకాశాలు పెద్దగా లేని స్థానాలను తొలుత కేటాయించగా తుది ఒప్పందం న్యాయమైన స్థానాలపై జరిగిందని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. మోరాదాబాద్‌లో రెండు స్థానాలను కోరిన కాంగ్రెస్‌.. అమ్రోహాతో సరిపెట్టుకున్నట్లు తెలిపాయి. ప్రియాంక, సోనియా జోక్యంతో ఈ చిక్కుముడి వీడిరదని పేర్కొన్నాయి.
కాగా, సోనియాగాంధీ గతంలో ప్రాతినిధ్యం వహించిన రాయ్‌ బరేలీ నుంచి ప్రియాంక రాజకీయ అరేంగేట్రం జరగవచ్చని పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. ఇదే విషయమై రాహుల్‌ గాంధీతో పాటు అఖిలేశ్‌ యాదవ్‌తో ప్రియంక సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రాహుల్‌ అధ్వర్యంలో న్యాయ యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో సాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img