Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

కూలిపోవడానికి ముందే తెగిపోయిన 22 తీగలు.. సిట్‌ నివేదికలో సంచలన విషయాలు

అక్టోబరు 30 నాటి ప్రమాదంలో 135 మంది మృతి
మోర్బీ తీగల వంతెన ప్రమాదంపై గుజరాత్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం జరగడానికి ముందే వంతెనలోని సగం తీగలు తుప్పుపట్టి తెగిపోయాయని, పాత ఇనుప కడ్డీలను కొత్త వాటితో వెల్డింగ్‌ చేయడం కూలిపోవడానికి దారితీసిన ప్రధాన లోపాలని సిట్‌ తన ప్రాథమిక నివేదిక పేర్కొంది. గతేడాది అక్టోబరు 30న మోర్బీ తీగల వంతెన కూలిపోయి 135 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై దర్యాప్తునకు గుజరాత్‌ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటుచేసింది. ఈ కమిటీ తన ప్రాథమిక నివేదికను డిసెంబరులో అందజేసింది. ఈ నివేదికను ఇటీవల రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మోర్బీ మున్సిపాలిటీతో పంచుకుంది.మచ్చు నదిపై బ్రిటిష్‌ కాలం నాటి ఈ వంతెన పునఃనిర్మాణ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న అజంతా గడియారాల సంస్థ (ఒరేవా గ్రూప్‌).. నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తోంది. మరమ్మతులు, నిర్వహణ, ఆపరేషన్‌లో లోపాలే ప్రమాదానికి కారణాలని సిట్‌ దర్యాప్తులో తేలింది. ఐఏఎస్‌ అధికారి రాజ్‌కుమార్‌ బేనీవాల్‌, ఐపీఎస్‌ అధికారి సుభాష్‌ త్రివేది, రోడ్లు భవనాలశాఖ చీఫ్‌ ఇంజినీర్‌, స్ట్రక్చరలల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ సిట్‌లో సభ్యులుగా ఉన్నారు.1887లో బ్రిటిష్‌ హయాంలో మచ్చు నదిపై నిర్మించిన వంతెన రెండు ప్రధాన తీగలలో ఒకటి తుప్పు పట్టిఉందని.. అక్టోబర్‌లో ప్రమాదానికి ముందు దాదాపు సగం వైర్లు తెగిపోయి ఉన్నట్టు గుర్తించింది. సిట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నదిపై ఉన్న వంతెన ప్రధాన కేబుల్‌ తెగిపోయి, విషాదానికి దారితీసింది. ప్రతి కేబుల్‌ ఏడు స్ట్రాండ్స్‌తో రూపొందించి.. ప్రతి ఒక్కటి ఏడు ఉక్కు వైర్లను కలిగి ఉంటుంది.. ఈ కేబుల్‌ను రూపొందించడానికి మొత్తం 49 వైర్లను ఏడు కడ్డీలతో కలిపినట్టు సిట్‌ నివేదిక పేర్కొంది.‘‘ఈ 49 వైర్లలో (ఆ కేబుల్‌) 22 తుప్పు పట్టినట్లు గమనించాం.. ఇది సంఘటనకు ముందే ఆ వైర్లు ఇప్పటికే విరిగిపోయి ఉండొచ్చని సూచిస్తుంది.. మిగిలిన 27 వైర్లు ఇటీవల తెగిపోయాయి’’ అని సిట్‌ తన నివేదికలో పేర్కొంది. ‘‘పాత ఇనుప కడ్డీలకు కొత్త వాటిని వెల్డింగ్‌ చేశారు.. దీని వల్ల వాటి సామర్థ్యం బలహీనపడిరది.. ఇటువంటి వంతెనల నిర్మాణానికి సింగిల్‌ రాడ్‌ కడ్డీలనే వినియోగిస్తారు’’ అని చెప్పింది. ప్రమాద సమయానికి వంతెనపై 300 మంది ఉన్నారని, ఇది సామర్థ్యానికి రెట్టింపని తెలిపింది. అయితే, వాస్తవ సామర్థ్యాన్ని ల్యాబ్‌ పరీక్షల్లో నిర్దారించాల్సి ఉందని సిట్‌ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img