Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు

తీరం వెంబడి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు
చేపల వేటకు వెళ్లొద్దంటూ మత్స్యకారులకు హెచ్చరిక

అమరావతి : బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి, అది అల్పపీడనంగా మారింది. దీనికితోడు పశ్చిమగాలులు వీస్తుండడంతో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల, రాయల సీమలో అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నా యని పేర్కొంది. శనివారం కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసాయి. మరో రెండు రోజులపాటు ఈ పరిస్థితి ఉండనుందని తెలిపింది. శనివారం ఉత్తర ఆంధ్ర – దక్షిణ ఒడిశా తీరం వెంబడి అల్పపీడనం ఏర్పడిరది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్ళే కొలదీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉంది. తూర్పు – పశ్చిమ షియర్‌ జోన్‌ ఉత్తర అక్షాంశం వెంబడి 3.1కి మీ నుండి 7.6 కి మీ మధ్య ఏర్పడి ఎత్తుకి వెళ్ళే కొలదీ దక్షిణం వైపునకు వంపు తిరిగి ఉంది. ఈ క్రమంలో శనివారం తేలికపాటి వర్షాలు కురవగా, ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలి పింది. ఇక తీరం వెంబడి పెనుగాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని, సముద్రం అలజడిగా ఉంటుందని విపత్తుల శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు హెచ్చరించారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకా శం ఉందని తెలిపారు. అలాగే సీమ జిల్లాల్లోనూ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మత్య్స కారులెవ్వరూ చేపలవేటకు వెళ్లొదని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img