Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఠారెత్తిస్తున్న టమాటా ధర

. దేశవ్యాప్తంగా మార్కెట్‌లలో రూ.100
. నెల రోజుల్లో రెట్టింపయిన వైనం

న్యూదిల్లీ : దేశంలో నిత్యావసర సరుకుల ధరలు మంటెత్తిస్తున్న తరుణంలో కూరగాయల ధరలు కూడా అమాంతం ఆకాశాన్నంటాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారు. ప్రతి రోజు కూరల్లో టమాటాలు వాడుతుంటాం. వేసవిలోనూ తక్కువ ధరకు అందుబాటులో ఉన్న టమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యధిక మార్కెట్‌లలో కిలో రూ.100 పలుకుతోంది. హోల్‌సేల్‌ మార్కెట్లలో రూ.65-70 మధ్య లభిస్తున్నాయి. వారం క్రితం వరకు హోల్‌సేల్‌ మార్కెట్‌లో రూ.30-35 మధ్య పలికిన టమాటా రిటైల్‌ మార్కెట్‌లో రూ.40-50 మధ్య లభించాయి. కానీ రుతు పవనాలు ఆలస్యం కావడంతో రిటైల్‌ మార్కెట్‌లో కిలో టమోటా ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. మండు వేసవిలో అంటే గత నెలలో ఉత్తర ప్రదేశ్‌, మహారాష్ట్రతో పాటు దేశమంతటా కిలో టమాటా రూ.2-5 మధ్య పలికింది. కానీ ఇప్పుడు కిలో టమాటా ధర కేవలం నెల రోజుల్లో 1,900 రెట్లు పెరిగింది. దిల్లీ మార్కెట్‌లలో కిలో టమాటా రూ.70-100 మధ్య విక్రయిస్తున్నారు. మధ్య ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాలో రూ.80-100 మధ్య ఉండగా, రాజస్థాన్‌లో రూ.90 నుంచి రూ.110 మధ్య పలుకుతున్నాయి. పంజాబ్‌లో రూ.60-80 మధ్య లభిస్తున్నాయి.
టమాటా ధర పెరుగుదలకు కారణాలు
అనేక రాష్ట్రాల్లో వర్షాల కారణంగా టమాటా తోటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడి వల్ల దిగుబడి తగ్గింది. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి టమాటాల సరఫరా గణనీయంగా తగ్గింది. గతంతో పోలిస్తే రైతులు టమాటా సాగు తగ్గించారని తెలుస్తోంది. హరియాణా, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి టమాటా సరఫరా తగ్గిపోవడంతో వారంలో హోల్‌సేల్‌ మార్కెట్‌లలో ధరలు రెట్టింపయ్యాయని దిల్లీలోని ఆజాద్‌ పూర్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌ వ్యాపారి అశోక్‌ గనోర్‌ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూడా ధరలు పెరిగాయన్నారు. రైతులు కూడా గిట్టుబాటు ధర లభించక పోవడంతో టమాటా తోటల్లో రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడటం లేదు. ఫలితంగా టమాటా తోటలపై చీడ పీడలు పెరిగిపోయి దిగుబడి తగ్గిపోవడం కూడా ధరల తగ్గుదలకు కారణం అని మహారాష్ట్రలోని నారాయణ్‌ గావ్‌ ప్రాంత రైతు అజయ్‌ బెల్హెకర్‌ తెలిపారు. ఇటీవల వచ్చిన బైపర్జోయ్‌ తుపాన్‌ కూడా టమాటా దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడిరదని కొందరు నిపుణులు చెప్పారు. ఈ తుపాను వల్ల గుజరాత్‌, మహారాష్ట్రల్లో పంట దిగుబడి తగ్గిపోయిందని. గుజరాత్‌ రాష్ట్రంలో పంట దిగుబడిపై తుపాను ప్రభావం ఫలితంగానే ధరలు పెరిగాయి. కొత్త పంట దిగుబడి రావడానికి కనీసం ఒకటి, రెండు నెలలు పడుతుందని రైతులు చెప్పారు. విత్తనాలు వేసిన మూడు నెలల తర్వాత వారానికి రెండు సార్లు టమాటాలు వినియోగంలోకి వస్తాయని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. టమాటా తోటలు కనీసం ఒకటి రెండు నెలల పాటు దిగుబడి ఇస్తాయని, అది కూడా ఆయా విత్తనాల వెరైటీ, భూమి, వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుందని చెబుతున్నారు. 2021-22లో దేశంలో 20 మిలియన్‌ టన్నుల టమాటాల దిగుబడి వచ్చింది. హైబ్రీడ్‌, లోకల్‌ టమాటాలు లభిస్తాయి. మధ్య ప్రదేశ్‌, ఆంధ్ర ప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు, ఒడిశా, గుజరాత్‌ రాష్ట్రాల్లో ప్రధానంగా టమాటాలు పండిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img