Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

డబుల్‌ ఇంజిన్‌ శక్తితో ఏపీ అభివృద్ధి

. వివిధ ప్రాజెక్టులకు బడ్జెట్‌లో రూ.50,474 కోట్ల సాయం
. కేంద్ర మంత్రి మురుగన్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి డాక్టర్‌ ఎల్‌.మురుగన్‌ తెలిపారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మిత్రపక్షాల కూటమి అధికారంలోకి రావడం వల్ల డబుల్‌ ఇంజన్‌ శక్తితో ఏపీ అభివృద్ధి జరుగుతుందని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 2047 లక్ష్యంగా నిధులు కేటాయించామన్నారు. ఆయా ప్రాంతాల్లో 8.2 శాతం ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా నిర్దేశించామన్నారు. కేంద్ర బడ్జెట్‌ అనంతరం మేధావులు, వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశమయ్యేందుకు విజయవాడ వచ్చిన కేంద్రమంత్రి మురుగన్‌ శనివారం ఓ హోటల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సరళతరం చేయడంతోపాటు ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేసే దిశగా బడ్జెట్‌లో తగిన ప్రతిపాదనలు చేసినట్లు మంత్రి మురుగన్‌ తెలిపారు. తాజా బడ్జెట్‌లో ఏపీ అభివృద్ధికి వివిధ రూపాల్లో రూ.50,474 కోట్లు కేటాయించామని తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విశాఖ – చెన్నై, హైదరాబాద్‌- బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చామని, ప్రతిష్ఠాత్మక పూర్వోదయ పథకాన్ని ఏపీలో అమలు చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల జార్ఖండ్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వరకు ఉన్న తూర్పుతీర ప్రాంతాన్ని దేశానికి గ్రోత్‌ఇంజిన్‌గా మారుస్తామన్నారు. ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్రతోపాటు ప్రకాశం జిల్లాను వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి… ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. దేశంలో రొయ్యల ఎగుమతిలో 60 శాతం ఆంధ్రప్రదేశ్‌ నుంచే ఉందని, బ్రీడిరగ్‌ సెంటర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. వ్యవసాయంలో విభిన్న పంటల పెంపకం కోసం పరిశోధనలు చేసేందుకు వీలుగా నిధులు కేటాయిస్తామన్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణానికి వివిధ సంస్థల ద్వారా రూ.15,000 కోట్లు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 23న సమర్పించిన కేంద్ర బడ్జెట్‌ 2024-25 చారిత్రాత్మకమైనదని, భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న ప్రధాని మోదీ కలను సాధించే దిశగా రూపుదిద్దుకుందని వెల్లడిరచారు.
ఈ బడ్జెట్‌లో పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, జాతీయ జీవనోపాధి మిషన్‌, స్టాండ్‌-అప్‌ ఇండియా వంటి కార్యక్రమాలకు కేటాయింపులు పెంచినట్లు మంత్రి వివరించారు. దీనివల్ల హస్తకళాకారులు, చేతివృత్తులు, స్వయం సహాయక సంఘాలు, ఎస్సీ/ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలు, వీధి వ్యాపారులకు సాధికారత లభిస్తుందని, కొత్త ఉద్యోగాలు సృష్టిస్తుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ఊతమిస్తుందన్నారు. సమగ్ర శిక్ష అభియాన్‌, పీఎం-పోషణ్‌, పీఎం-శ్రీ పథకాలకు కేటాయింపులు పెంచినట్లు వెల్లడిరచారు. దీనివల్ల మౌలిక సదుపాయాలు, బోధన అభ్యాస వనరులు, పోషకాహార మద్దతు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రాధాన్యత పథకాలకు గణనీయమైన ప్రోత్సాహం అందుతుందన్నారు. ఆరోగ్య సంబంధిత కేటాయింపులను గత ఏడాది కంటే 13 శాతం పెంచామని, ప్రజల ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడంలో ప్రభుత్వ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని కేంద్ర మంత్రి మురుగన్‌ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img