Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

రాష్ట్రాల సహకారంతోవికసిత్‌ భారత్‌

. లక్ష్యసాధనలో కలిసి రావాలి: మోదీ
. నీతి ఆయోగ్‌ సమావేశం నుంచి మమత వాకౌట్‌
. ఇదేనా సహకార సమాఖ్యవాదం: విపక్షాల ప్రశ్న

న్యూదిల్లీ : భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలపడమే లక్ష్యమని నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ అన్నారు. ఇందుకోసం ఆధునిక సాంకేతికతను, భౌగోళికరాజకీయ మార్పుల వంటివి దోహదం కాగలవన్నారు. ఇందుకుగాను అన్ని రాష్ట్రాల సహకారం కోరారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించే విధానాలు రూపొందించాలని సూచించారు. మనది యువశక్తితో కూడుకున్న దేశమని, కార్మికశక్తి దృష్ట్యా యావత్‌ ప్రపంచం చూపును ఆకర్షిస్తోందని, యువతలో నైపుణ్యాభివృద్ధి మెరుగుదలను లక్ష్యంగా పెట్టుకోవాలని, పరిశోధనలు, సంస్కరణలు, అన్వేషణలు, ఉద్యోగ పరిజ్ఞానం, నైపుణ్యత పెంచుకోవడం ద్వారా వికసిత్‌ భారత్‌ లక్ష్యం సాధించాలని మోదీ వెల్లడిరచారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధన కోసం ప్రణాళికలు రూపొందించుకు అజెండాతో నీతి ఆయోగ్‌ తొమ్మిదో సమావేశం శనివారం రాష్ట్రపతి భవన్‌లోగల సాంస్కృతిక కేంద్రంలో ప్రధాని అధ్యక్షతన జరిగింది. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సహకార, భాగస్వామ్య పరిపాలన, గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగైన జీవన పరిస్థితుల కల్పనకు సంబంధిత యంత్రాంగాల్లో ప్రభుత్వ జోక్యాన్ని పెంచడం వంటి అంశాలపై నీతి ఆయోగ్‌ సమావేశం ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించింది. ఎన్‌ఈపీ వంటి సంస్కరణలు, ముద్రా, పీఎం విశ్వకర్మ, పీఎం స్వానిధి వంటి పథకాలు, క్రిమినల్‌ న్యాయ వ్యవస్థలో మార్పులు తదితరలతో భారతీయ సమాజం, ఆర్థిక వ్యవస్థలో సంస్కరణాత్మక మార్పు సాధ్యమని మోదీ చెప్పినట్లుగా ‘ఎక్స్‌’లో నీతి ఆయోగ్‌ పేర్కొంది. నీతి ఆయోగ్‌ సమావేశాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో వరుస పోస్టులు పెట్టారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని, నేరుగా ప్రజలతో అనుసంధానమై ఉంటాయి కాబట్టి ఈ లక్ష్యాన్ని సాధించడంలో రాష్ట్రాలు క్రియాశీల పాత్ర పోషించా లన్నారు. ఇది సాంకేతికతలు, భౌగోళికరాజకీయ మార్పులతో పాటు అవకాశాల దశకమని, అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని సూచించారు. అంతర్జాతీయ పెట్టుబడులను రాబట్టేలా విధానాలు ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం చిన్నచూపు, సమస్యల నిర్లక్ష్యం... నిధుల్లో సముచిత కేటాయింపులు, పన్నుల్లో వాటాలు లేకపోవడం వంటి కారణాలతో ‘ఇండియా’ ముఖ్యమంత్రులు ఈ సమావేశాన్ని బహిష్కరించగా బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రమే హాజరయ్యారు. అయితే తనకు మాట్లాడేందుకు సమయం ఇవ్వకుండా అవమానించారని అసహనానికి గురైన ఆమె వాకౌట్‌ చేశారు. ప్రతిపక్షం తరపున ఏకైక ప్రతినిధిగా సమావేశానికి వస్తే కేవలం ఐదు నిమిషాల్లో మైక్‌ ఆపేస్తారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మమత తప్పుడు ఆరోపణలు చేశారని, అందరు ముఖ్యమంత్రులకు సముచిత సమయం ఇచ్చామని కేంద్రం చెప్పుకుంది. అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ ‘నాతో అన్యాయంగా వ్యవహరించారు. మాట్లాడుతుండగానే మైక్‌ ఆపేశారు’ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌, గోవా, అసోం, చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రులకు ఎక్కువ సమయమిచ్చి తన ప్రసంగాన్ని ఐదు నిమిషాల్లోనే ఆర్థాంతంగా ఆపేశారని ఆరోపించారు. సమావేశంలో తనను ఘోరంగా అవమానించారని, ఇకపై ఏ సమావేశాలకు రాబోనని తృణమూల్‌ అధినేత్రి చెప్పారు. కాగా, ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న జేడీయూ అధ్యక్షుడు, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కూడా గైర్హాజరు కావడం చర్చకు దారితీసింది. సమావేశానికి ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నలు, అనేక మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అయితే ఇండియా ఐక్య సంఘటన భాగస్వామ్య పార్టీల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్‌ (డీఎంకేతమిళనాడు), పినరయి విజయన్‌ (సీపీఎంకేరళ), భగవంత్‌ మాన్‌ (ఆప్‌పంజాబ్‌), సిద్దరామయ్య (కాంగ్రెస్‌`కర్నాటక), సుఖ్విందర్‌ సింగ్‌ సుకు (హిమాచల్‌ ప్రదేశ్‌), రేవంత్‌ రెడ్డి (తెలంగాణ), హేమంత్‌ సోరెన్‌ (జార్ఖండ్‌) ఈ సమావేశాన్ని బహిష్కరించారు.
మోదీ జేబు సంస్థ: కాంగ్రెస్‌
నీతి ఆయోగ్‌ పదేళ్లుగా ప్రధాని మోదీ డప్పు కొట్టడానికే పరిమితమైందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ విమర్శించారు. ఒక ముఖ్యమంత్రితో సమావేశంలో జరిగినది ఆమోదయోగ్యం కాదన్నారు. ‘కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులతో పాటు ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. బెంగాల్‌ సీఎం ఒక్కరే హాజరయ్యారు. ఆమె విషయంలో జరిగింది ఆక్షేపణీయం’ అని జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ కూడా మమతకు మద్దతుగా కేంద్రాన్ని దుయ్యబట్టారు. సహకార సమాఖ్యవాదమంటే ఇదేనా అంటూ నిలదీశారు. కోఆపరేటివ్‌ ఫెడరలిజానికి చర్చలు…. అన్ని గళాలు వినడం అవశ్యమన్నారు. ఒక ముఖ్యమంత్రితో ఈ తరహా ప్రవర్తన ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కూడా అంతర్భాగమని, వారిని శత్రువులుగా చూడటం, అణచి వేయాలనుకోవడం తగదని కేంద్రానికి స్టాలిన్‌ హితవు పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img