Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Monday, September 30, 2024
Monday, September 30, 2024

రైతులకు వరాలు

. 14 పంటలకు ఎంఎస్‌పీ పెంపు
. వరిపై రూ.117 `క్వింటా ధర రూ.2,300
. గుజరాత్‌, తమిళనాడులో వాయుశక్తి ప్రాజెక్టులకు రూ.7,453 కోట్లు
. వారణాసి విమానాశ్రయం అభివృద్ధికి రూ.2 వేల కోట్లు
. మహారాష్ట్రలో వర్దన్‌ పోర్టు కోసం రూ.76 వేల కోట్లు బ కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

న్యూదిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో రైతులు కొట్టిన దెబ్బకు మోదీ సర్కారు దిగివచ్చింది. మూడోసారి ప్రమాణం చేసిన వెంటనే పీఎం`కిసాన్‌ నిధుల జమ ఫైలుపై సంతకం చేసిన ప్రధాని మోదీ…బుధవారం కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు కనీస మద్దతు ధరపై నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ వ్యయం, ధరలు కమిషన్‌ (సీఏసీపీ) సిఫార్సుల ఆధారంగా 14 ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పీ)ను కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, దిల్లీలో ఎన్నికలు జరగనున్న తరుణంలో కేబినెట్‌ సమావేశం జరగడం ప్రాధాన్యత విమానాశ్రయం అభివృద్ధికి రూ.2,870 కోట్లు, మహారాష్ట్రలోని వర్ధన్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ మేజర్‌ పోర్టు కోసం రూ.76,200 కోట్లు మంజూరు చేసింది. కేబినెట్‌ అనంతరం కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సమావేశ నిర్ణయాలను మీడియాకు వెల్లడిరచారు. 2024`25 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌ కోసం వరి పంట ఎంఎస్‌పీని 5.35 శాతం పెంచడంతో క్వింటా ధర రూ.2,300 అయిందని కేంద్రమంత్రి తెలిపారు. ‘సాధారణ’ గ్రేడు వరికి ఎంఎస్‌పీ రూ.117 మేర పెరిగిందన్నారు. ‘ఎ’ గ్రేడ్‌ వరి క్వింటా ధర రూ.2,320గా ఉంటుందని వైష్ణవ్‌ వెల్లడిరచారు. సాగు వ్యయానికి 1.5 రెట్లుగా ఎంఎస్‌పీ ఉండాలని 2018లో కేంద్ర బడ్జెట్‌ వేళ నిర్ణయించినట్లు తెలిపారు. సీఏసీపీ ఆధారంగా సాగు వ్యయాన్ని అంచనా వేస్తారన్నారు. ఫుడ్‌ కార్పొరేషన్‌ వద్ద 53.4 మిలియన్‌ టన్నుల వరి నిల్వ ఉన్నది. జులై ఒకటో తేదీ నాటికి అవసరమైన బఫర్‌ కంటే ఇది నాలుగు రెట్లు అధికం. సేకరణ అవసరం లేకుండా ఏడాది పాటు సంక్షేమ పథకాలకు ఇది సరిపోతుంది. ఇదిలావుంటే, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాలలో చేపట్టే ఒక జీబీ సామర్థ్యంగల ఆఫ్‌షోర్‌ వాయుశక్తి ప్రాజెక్టుల కోసం రూ.7,453 కోట్లను కేబినెట్‌ మంజూరు చేసినట్లు వైష్ణవ్‌ చెప్పారు. వీజీఎఫ్‌ (వయబిలిటీ గ్యాప్‌ ఫండిరగ్‌) పథకం కింద గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాలలో చెరొక 500 మెగావాట్ల ప్రాజెక్టు ఉంటుందన్నారు. 2015లో నోటిఫై చేసిన జాతీయ ఆఫ్‌షోర్‌ వాయు శక్తి విధానం అమలు దిశగా ఇది ముందడుగని కేంద్రమంత్రి తెలిపారు. అలాగే, మహారాష్ట్రలోని వర్ధన్‌లో ‘ఆల్‌ వెదర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ డీప్‌డ్రాఫ్ట్‌ మేజర్‌ పోర్ట్‌’ అభివృద్ధికిగాను రూ.76,200 కోట్లను కేంద్ర కేబినెట్‌ మంజూరు చేసిందని, ప్రపంచంలోని టాప్‌ 10 పోర్టుల్లో ఒకటిగా ఇది నిలుస్తుందన్నారు. ఇక వారణాసిలోని లాల్‌ బహదూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ కోసం రూ.2,869.65 కోట్లను కేంద్రం మంజూరు చేసిందని వైష్ణవ్‌ తెలిపారు. ప్రధాని ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ విమానాశ్రయం విస్తరణలో భాగంగా కొత్త టెర్మినల్‌ భవనం నిర్మాణం, ఆప్రాన్‌, రన్‌వే, ప్యారలల్‌ ట్యాక్సీ ట్రాక్‌ విస్తరణతో పాటు అనుబంధ పనులు జరుగుతాయని అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img