London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Saturday, October 19, 2024
Saturday, October 19, 2024

విద్యుత్‌ బాదుడు ఆపండి

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్‌

విశాలాంధ్రవిజయవాడ: విద్యుత్‌ చార్జీల పెంపు, ట్రూఅప్‌ చార్జీల విధింపు, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు వంటి విద్యుత్‌ భారాలను ప్రజలపై రుద్దవద్దని, విద్యుత్‌ చార్జీల బాదుడు నుండి ప్రజలకు విముక్తి కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం విజయవాడలోని దాసరి భవన్‌లో జరిగింది. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ జాతీయ రాజకీయ పరిణామాల గురించి వివరించగా... రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను, భవిష్యత్‌ కర్తవ్యాల గురించి వివరించారు. దోనేపూడి శంకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్‌ సంస్కరణలను గత వైసీపీ ప్రభుత్వం వేగవంతంగా అమలు చేస్తూ 8 పర్యాయాలు విద్యుత్‌ చార్జీలు పెంచి, దాదాపు రూ.50 వేల కోట్ల మేర రాష్ట్ర ప్రజలపై భారం మోపిందని తీర్మానం విమర్శించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు తలొగ్గుతూ రాష్ట్రంలో స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయడం ద్వారా అదనంగా మరో రూ.17 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమైందని అభిప్రాయపడిరది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్‌ చార్జీల భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమవ్వడాన్ని ఖండిరచింది. 202223 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో ప్రస్తుతం రూ.8,114 కోట్ల మేరకు భారం మోపేందుకు విద్యుత్‌ సంస్థలు సిద్ధమవ్వడంపై విచారం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్‌ సంస్థలు హిందూజా సంస్థకు (హెచ్‌ఎన్‌పీసీఎల్‌) రూ.1,234.68 కోట్లు చెల్లించి… ఆ భారాన్ని ట్రూఅప్‌ ప్రతిపాదనలలో కలపడం దుర్మార్గమని విమర్శించింది.
తాము అధికారంలోకొస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ… అధికారం చేపట్టాక విద్యుత్‌ చార్జీలు పెంచుతూ ప్రజలకు కరెంట్‌ షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవ్వడాన్ని సీపీఐ రాష్ట్ర సమితి నిరసించింది.
తక్షణమే విద్యుత్‌ ట్రూఅప్‌ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీలు ఎత్తివేయాలని, ప్రీపెయిడ్‌ స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img