Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

‘సిద్ధం’ సభకు అసమ్మతి సెగ?

రేపు దెందులూరులో వైసీపీ ‘సిద్ధం’
కొంతమంది ఎమ్మెల్యేలు, నేతల దూరం
ఒంగోలులో మెట్టు దిగని బాలినేని

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : వైసీపీ సిద్ధం సభకు ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన కొంతమంది అసమ్మతి నేతలు, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తాను సిద్ధం సభకు రావట్లేదని తేల్చిచెప్పారు. దీంతో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌, వైసీపీ నాయకులు పడమట సురేశ్‌బాబు మైలవరానికి వెళ్లి పార్టీ శ్రేణులను సిద్ధం సభకు తరలించేందుకు యత్నిస్తున్నారు. వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాలకు కలిపి భీమిలిలో ‘సిద్ధం’ సభ నిర్వహించింది. రెండో సభను ఈనెల 3వ తేదీన ఏలూరుజిల్లా దెందులూరులో నిర్వహించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉమ్మడి కృష్ణాజిల్లా వైసీపీ కేడర్‌ సమావేశానికి పెద్దఎత్తున తరలివెళ్లనుంది. అందుకు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. ఈ సభకు వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ ముఖ్యఅతిథిగా హాజరై, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. కొంత కాలంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ అసంతృప్తితో ఉన్నారు. తన నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి లేదని వాపోతున్నారని వ్యాఖ్యానించారు. అంతకుముందు తాను మైలవరం నుంచి పోటీ చేయబోనని ప్రకటించగా… ఆయనను తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించి సర్దిచెప్పారు. ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయానికి వసంత కృష్ణప్రసాద్‌ మూడు సార్లు వెళ్లారు. మైలవరంలో మంత్రి జోగి రమేశ్‌ అనుచరులు, వసంత మధ్య తీవ్ర విభేదాలున్నాయి. కొంతకాలంగా వారి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. దీనిపైనా వైసీపీ ఆధిష్ఠానం ఇద్దరికి సర్దిచెప్పింది. ఇటీవల వైసీపీలో ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ చేరడంతో, మొత్తం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో పార్టీ పరంగా ఎలాంటి సమస్యలు ఉండబోవని ఆధిష్ఠానం భావించింది. ఉన్న పళంగా సిద్ధం సభకు వెళ్లేందుకు వసంత కృష్ణప్రసాద్‌ ఆసక్తి చూపకపోవడంతో వైసీపీ నేతలకు షాక్‌ ఇచ్చినట్లయింది. వైసీపీలో అనేక అసంతృప్తులు ఉన్నప్పటికీ, తొలిసారిగా భీమిలిలో నిర్వహించిన సిద్ధం సభకు జన సమీకరణ బాగానే జరిగింది. దెందులూరులో జరిగే రెండో సభకు ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి అసంతృప్తుల సెగ తగిలే అవకాశముంది. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి ఈ సభకు వెళ్లే అవకాశాలు లేవు. ఇక మూడో సిద్ధం సభను ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలిపి నిర్వహించనున్నారు. అనంతరం రాయసీమ జిల్లాల కేంద్రంగా మరో సభకు ప్రణాళిక రూపొందించారు. ఈ సిద్ధం సభలకు ఇన్‌ఛార్జి పదవులు దక్కని ఎమ్మెల్యేలు, వారి అనుచరులంతా దూరంగా ఉంటామంటూ ఆధిష్ఠానానికి హెచ్చరికలు పంపుతున్నారు.
ఉమ్మడి గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలపై కసరత్తు
వైసీపీ ఇన్‌ఛార్జిల మార్పుల్లో భాగంగా ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలపై అధిష్ఠానం ప్రత్యేక దృష్టి పెట్టింది. గట్టి వ్యక్తులను బరిలో దించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే నరసరావుపేట ఎంపీగా నెల్లూరు టౌన్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ను, తూర్పుగోదావరిజిల్లా కాకినాడ ఎంపీ స్థానానికి చలమలశెట్టి సునీల్‌ పేరును ఖరారు చేశారు. ఈ జిల్లాల్లో మిగిలిన నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్‌ కసరత్తు చేస్తున్నారు. రేసులో ఎనిమిది మంది నేతలు ఉన్నారు. ఒంగోలు ఎంపీ ఇన్‌చార్జిపైనా ఆధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చింది. దీంతో ఒంగోలు ఎంపీ మాగంటి శ్రీనివాస్‌రెడ్డి టీడీపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఆయనకు వైసీపీ నుంచి టికెట్‌ లేదన్న సంగతి స్పష్టమైంది. ఆయనకు టికెట్‌ ఇప్పించేందుకు ఒంగోలు ఎంపీ బాలినేని శ్రీనివాసులురెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయినప్పటికీ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రాంతీయ ఇన్‌ఛార్జిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని వైసీపీ నియమించింది. భవిష్యత్‌లో ఆయనకే ఒంగోలు ఇన్‌ఛార్జి పదవి కేటాయిస్తారన్న ప్రచారముంది. చెవిరెడ్డిని పార్టీ పరంగా నియమించడతో మాగంటికి టికెట్‌ లేదనేదీ స్పష్టమైంది. దీంతో ఆయన టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. ఇదే జరిగితే ఒంగోలులో వైసీపీకి కొంత నష్టం చేకూరనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img