Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Monday, September 30, 2024
Monday, September 30, 2024

హైకోర్టు తీర్పు అసాధారణమే…

. కేజ్రీవాల్‌ బెయిల్‌పై సుప్రీం
. విచారణ రేపటికి వాయిదా

న్యూదిల్లీ : మద్యం విధానానికి సంబంధించి మనీ లాండరింగ్‌ కేసులో బెయిల్‌ అంశంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈ అంశంపై హైకోర్టు నిర్ణయం వెలువడ్డాకే తమ తీర్పు ఉంటుందని, అప్పటివరకు వేచి ఉండాలని న్యాయస్థానం సూచించింది. ఒకవేళ ఆదేశాలు ఇస్తే అది ముందస్తు తీర్పే అవుతుందని అభిప్రాయపడిరది. దీంతో కేజ్రీవాల్‌ ప్రస్తుతానికి తీహారు జైలుకే పరిమితం కావాల్సి ఉంటుంది. మద్యం కుంభకోణం కేసులో ట్రయల్‌ కోర్టు తనకు ఇచ్చిన బెయిల్‌పై దిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ సోమవారం విచారించింది. కేజ్రీవాల్‌ తరపున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఫ్వీు, విక్రమ్‌చౌదరీ హాజరుకాగా… ఈడీ తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ రాజు వాదనలు వినిపించారు.ట్రయల్‌ కోర్టు బెయిల్‌ ఆర్డర్‌ చూడకముందే హైకోర్టు స్టే ఇవ్వగలిగినప్పుడు… మీరెందుకు (సుప్రీం ధర్మాసనం) హైకోర్టు ఆర్డరుపై స్టే విధించలేరు? అని అభిషేక్‌ సింఫ్వీు వాదించారు. అంతేకాకుండా హైకోర్టు అలా స్టే విధించడం ఊహించని విషయమన్నారు. కింది కోర్టులో తనకు అనుకూల తీర్పు వచ్చినప్పుడు ఎందుకు వేచి ఉండాలని వాదించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ… హైకోర్టు నిర్ణయం కాస్త అసాధారణంగానే కనిపిస్తోందని, అయినప్పటికీ ఒకవేళ హైకోర్టు తప్పిదం చేస్తే తాము దాన్ని పునరావృతం చేయాలా అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఒకరోజు వేచిచూడడం వల్ల ఇబ్బంది ఏముందని, జూన్‌ 26న దీనిపై విచారణ చేపడతామని తెలిపింది. మరోవైపు కేజ్రీవాల్‌ బెయిల్‌ స్టేపై దిల్లీ హైకోర్టు మంగళవారం నిర్ణయం వెల్లడిరచే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img