Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

గత నెల శ్రీనగర్‌లో నిర్వహించిన జీ20 టూరిజం సమ్మిట్‌ విజయవంతం కాకుండా చైనా, పాక్‌లు చేసిన కుట్రను ముందే పసిగట్టిన నిఘా వర్గాలు .. భద్రతా బలగాలను అప్రమత్తం చేశాయి దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఎన్ఎస్‌జీ, మార్కోస్ లాంటి పటిష్టమైన భద్రతా దళాలను మోహరించాయి. విదేశీ ప్రతినిధులు బస చేసే హోటల్‌ను తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్టు తెలియడంతో అప్పటికప్పుడు వేదికను మార్చారు. అప్పటి నుంచి వరుస ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయి.జమ్మూ కశ్మీర్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. నియంత్రణ రేఖ వెంబడి ముష్కరులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నట్టు నిఘా వర్గాలు అప్రమత్తం చేయడంతో సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకుని, ఎన్‌కౌంటర్‌కు దారితీసింది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ సమీపంలోని జుమగుండ్ వద్ద ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం రావడంతో గురువారం రాత్రి సైన్యం అక్కడకు చేరుకుంది.ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ సమయంలో ముష్కరులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సైన్యం ఎదురుకాల్పులు ప్రారంభించడంతో ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్టు కశ్మీర్ జోన్ ఏడీజీపీ విజయ్ కుమార్ ట్విట్టర్‌లో తెలిపారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారని, ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదుల గురించి కచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టినట్టు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను సైన్యం సమర్ధంగా తిప్పికొడుతోంది. మూడు రోజుల కిందట కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు చొరబాటు యత్నాన్ని సైన్యం భగ్నం చేసిన విషయం తెలిసిందే. చొరబాటుకు సిద్ధంగా ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు జల్లెడపట్టాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పుల జరపడంతో సైన్యం అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపింది. సైన్యం కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img