Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

36 శాతం మందిపైక్రిమినల్‌ కేసులు

రాజ్యసభ అభ్యర్థులపై ఏడీఆర్‌ నివేదిక

న్యూదిల్లీ : కొత్తగా రాజ్యసభకు పోటీ చేసిన అభ్యర్థులపై నేరపూరిత కేసులు, ఆస్తుల వివరాలను ఎన్నికల హక్కుల మండలి అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడిరచింది. 36 శాతం మంది రాజ్యసభ అభ్యర్థులు తమపై నేరపూరిత కేసులు ఉన్నాయని వెల్లడిరచినట్లు తెలిపింది. అలాగే, అభ్యర్థుల సగటు ఆస్తులు రూ.127.81 కోట్లుగా ఉన్నట్లు ఏడీఆర్‌ వివరించింది. ఏడీఆర్‌, జాతీయ ఎన్నికల నిఘా సంస్థ 15 రాష్ట్రాల్లోని 56 స్థానాలకు పోటీలో ఉన్న 59 మంది అభ్యర్థులలో 58 మంది స్వీయ ప్రమాణ పత్రాలను విశ్లేషించాయి. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. పత్రాలు సరిగా స్కాన్‌ చేయని కారణంగా కర్నాటక నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి జీసీ చంద్రశేఖర్‌ను విశ్లేషణ నుంచి తొలగించారు. పరిశీలించిన అభ్యర్థుల్లో 36 శాతం మంది తమపై నేర కేసులను ప్రకటించుకున్నట్లు విశ్లేషణలో తేలింది. అదనంగా ఈ వ్యక్తులలో 17 శాతం మంది తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. ఒక అభ్యర్థి హత్యాయత్నానికి సంబంధించిన కేసులను కలిగి ఉన్నారు. విశ్లేషణ ప్రకారం, 30 మంది బీజేపీ అభ్యర్థుల్లో ఎనిమిది మంది (27 శాతం), తొమ్మిది మంది కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో ఆరుగురు (67 శాతం), నలుగురు టీఎంసీ అభ్యర్థుల్లో ఒకరు (25 శాతం), ఎస్పీ అభ్యర్థులు ముగ్గురిలో ఇద్దరు (67 శాతం), ముగ్గురు వైసీపీ అభ్యర్థుల్లో ఒకరు (33 శాతం), ఆర్‌జేడీకి చెందిన ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరు (50 శాతం), ఇద్దరు బీజేడీ అభ్యర్థుల్లో ఒకరు (50 శాతం), బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఒకరు (100 శాతం) ప్రకటించారు. వారి అఫిడవిట్లలో తమపై నేర కేసులు ఉన్నట్లు వివరించారు. అంతేకాకుండా అభ్యర్థుల ఆర్థిక నేపథ్యాలను విశ్లేషించారు. దాదాపు 21 శాతం మంది అభ్యర్థులు కోటీశ్వరులు… రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. రాజ్యసభ అభ్యర్థుల సగటు ఆస్తులు రూ.127.81 కోట్లు. హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి అభిషేక్‌ మను సింఫ్వీు మొత్తం ఆస్తుల విలువ రూ.1,872 కోట్లు, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి జయ అమితాబ్‌ బచ్చన్‌ రూ.1,578 కోట్లు, కర్నాటక నుంచి జేడీ(ఎస్‌) అభ్యర్థి కుపేంద్రరెడ్డి రూ.871 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. విశ్లేషణ ప్రకారం, మొదటి ముగ్గురు అత్యంత ధనవం తులు. ఇక పేద అభ్యర్థుల్లో మధ్య ప్రదేశ్‌ అభ్యర్థి బాలయోగి ఉమేష్‌ నాథ్‌ రూ.47 లక్షలకు పైగా ఆస్తులు, బీజేపీ పశ్చిమ బెంగాల్‌ అభ్యర్థి సమిక్‌ భట్టాచార్య రూ.కోటి ఆస్తులు, బీజేపీ ఉత్తర ప్రదేశ్‌ అభ్యర్థి సంగీతాకు చెందిన ఆస్తులు కోటి రూపాయలుగా తమ అఫిడవిట్లలో ప్రకటించుకున్నారు. 17 శాతం మంది అభ్యర్థులు 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్హతలు కలిగి ఉండగా, 79 శాతం మంది గ్రాడ్యుయేట్‌ లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీలు కలిగి ఉన్నారు. మెజారిటీ (76 శాతం) అభ్యర్థులు 51-70 ఏళ్ల మధ్య వయస్కులు, 31-50 ఏళ్లలో తక్కువ నిష్పత్తిలో (16 శాతం) ఉన్నారు. విశ్లేషణ ప్రకారం కేవలం 19 శాతం మంది అభ్యర్థులు మాత్రమే మహిళలు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img