Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

నా భార్యకు ఏమైనా జరిగితే వదిలిపెట్టను..

పాక్‌ ఆర్మీ చీఫ్‌కు ఇమ్రాన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
జైలుకు వెళ్లడానికి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసిమ్‌ మునీరే కారణమని పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు. బుష్రా బీబీ ఓ అవినీతి కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఇస్లామాబాద్‌ శివారులోని తన నివాసంలో గృహనిర్బంధంలో ఉన్నారు.ఈ మేరకు ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు ఇమ్రాన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. గృహ నిర్బంధంలో ఉన్న తన భార్య బుష్రా బీబీకి ఏమైనా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. నా భార్య బుష్రా బీబీకి శిక్ష పడటానికి జనరల్‌ అసిమ్‌ మునీరే కారణం. బుష్రా బీబీకి శిక్ష విధించిన న్యాయమూర్తి నాతో మాట్లాడారు. తీర్పు విషయంలో తనపై ఒత్తిడి ఉండేదని చెప్పారు. నా భార్యకు ఏదైనా జరిగితే అసిమ్‌ మునీర్‌ను సహించేది లేదు. నేను బతికున్నంత వరకూ అసిమ్‌ మునీర్‌ను వదిలి పెట్టను. అతడి రాజ్యాంగ విరుద్ధమైన, అక్రమ చర్యలను బయటపెడతా అని ఇమ్రాన్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. కాగా, గృహ నిర్బంధంలో ఉన్న తన భార్యను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఇమ్రాన్‌ ఇటీవలే తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన భార్యపై విషప్రయోగం జరిగినట్లు ఇమ్రాన్‌ ఆరోపించారు. అందుకు ఆధారాలున్నాయని జడ్జికి తెలియచేశారు. తన భార్యను ప్రైవేట్‌ నివాసంలో నిర్బంధించారని, దానిని సబ్‌జైల్‌గా మార్చారని పేర్కొన్నారు. ఆమెకు ఏమైనా జరిగితే ఆర్మీ చీఫ్‌ బాధ్యత వహించాలన్నారు. కాగా, ఇమ్రాన్‌ భార్య బుష్రా మాట్లాడుతూ తాను అమెరికన్‌ ఏజెంట్‌ అని పుకార్లు పుట్టించారని, తన ఆహారంలో టాయిలెట్‌ క్లీనర్‌ కలిపారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img