Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఇంటింటి ప్రచారానికిఅనుమతిపై పునరాలోచన

త్వరలో సరైన నిర్ణయం : సీఈవో మీనా
తాత్కాలిక ఎన్నికల కార్యాలయాల్లో పార్టీ బ్యానర్‌ పెట్టుకోవచ్చు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఇంటింటి ప్రచారానికి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్న నిబంధనపై రాజకీయ పార్టీలన్నీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎన్నికల సంఘం పునరాలోచనలో పడిరది. దీనిపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి ఎన్నికల నిర్వహణకు ముందస్తుగా చేస్తున్న ఏర్పాట్లను, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్ట అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా అనుమతి పొందిన తర్వాతే ఇంటింటి ప్రచారానికి వెళ్లాలనే నిబంధన అమలు దుస్సాధ్యమని, ఈ నిబంధనను పున: సమీక్షించాలని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ముక్తకంఠంతో కోరారని తెలిపారు. ఈ నిబంధన అమలు విషయంలో వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించడంతో పాటు భారత ఎన్నికల సంఘం దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్లామన్నారు. త్వరలోనే సరైన నిర్ణయం తీసుకొని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు తెలియజేస్తామన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో శాశ్వత ప్రాతిపదికన ఉన్న రాజకీయ పార్టీల కార్యాలయాల్లో స్థానిక చట్టాలు, అనుమతుల మేరకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రకటనల హోర్డింగులను తొలగించకుండా కొనసాగించాలని ముకేశ్‌ కుమార్‌ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. అయితే ఆ హోర్డింగుల నిర్మాణాలు బలహీనంగా ఉంటే భద్రత దృష్ట్యా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పార్టీ కార్యాలయాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన 4 ఇంటు 8 అడుగుల బ్యానర్‌, ఒక ప్లాగ్‌ను అనుమతించాలని సూచించారు. రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరని, అయితే 48 గంటల ముందుగా సువిధ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. కానీ కొన్ని అత్యవసర పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు 48 గంటల ముందు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేని పక్షంలో ఆఫ్‌ లైన్‌ ద్వారా కూడా అత్యవసర దరఖాస్తులను స్వీకరించి, ఆ వివరాలు అన్నింటినీ ఎన్కోర్‌ పోర్టల్‌లో నమోదు చేసి సకాలంలో తగిన అనుమతులను జారీచేయాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రకటనలకు సంబంధించి భారత ఎన్నిక సంఘం మార్గదర్శకాలతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌ పురపాలక చట్టం, స్థానిక సంస్థల చట్టం, జీహెచ్‌ఎంసీ చట్టాలను పరిగణలోకి తీసుకుంటూ అనుమతులు మంజూరు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌, జాయింట్‌ సీఈవో ఎ.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవోలు కె.విశ్వేశ్వరరావు, ఎస్‌.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img