Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఇది రాష్ట్రమా… రావణ కాష్టమా?

. ‘నాలుగేళ్ల నరకం’ పేరుతో కొత్త కార్యక్రమం
. చంద్రబాబు ట్విట్టర్‌లో వీడియో విడుదల

విశాలాంధ్ర బ్యూరో -అమరావతి: నాలుగేళ్ల నరకం’ అనే పేరుతో తెలుగుదేశం పార్టీ కొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సోమవారం ట్విట్టర్‌ వేదికగా వీడియో విడుదల చేశారు. రానున్న రోజుల్లో గల్లీ నుంచి పట్టణాల వరకు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, వైసీపీ నాయకుల అక్రమాలను ఎత్తి చూపే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గత నాలుగేళ్లుగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియచేయడం ఈ ‘నాలుగేళ్ల నరకం’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం దాదాపు నెల రోజుల పాటు సాగనుంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. గత నాలుగేళ్లుగా వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని జనంలోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లనున్నారు. ప్రచార కార్యక్రమంలో రంగాలవారీగా జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ 40 ఏళ్లు రాష్ట్రాన్ని వెనక్కి ఎలా నెట్టారో చూపిస్తూ ప్రజల వద్దకు తీసుకెళ్లనున్నారు. ప్రచారంలో భాగంగా తొలి రోజు చంద్రబాబు ‘ఇది రాష్ట్రమా… రావణ కాష్ఠమా..?’ అంటూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల గురించి ప్రశ్నిస్తూ వీడియో విడుదల చేశారు. వరుస దుర్ఘటనలపై చంద్రబాబు నాలుగేళ్ల నరకం అంటూ వివిధ ఉదాహరణలు పేర్కొన్నారు. పదవ తరగతి విద్యార్థిని వైసీపీ నేతలు సజీవ దహనం చేసినా, ఏలూరులో యాసిడ్‌ దాడి జరిగినా ఈ బిడ్డ ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. నెల్లూరు, మచిలీపట్నంలో అత్యాచారం ఘటనలపైనా సీఎం ఏమీ మాట్లాడలేదని ధ్వజమెత్తారు. రాజకీయ కక్షతో ఓ మహిళను చంపినా ఈ బిడ్డ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో వరుస సంఘటనలు జరిగితే ఈ బిడ్డ శాంతి భద్రతలపై కనీస సమీక్ష చేయలేదని దుయ్యబట్టారు. ఏదైనా దుర్ఘటన జరిగితే జగన్‌మోహన్‌ రెడ్డికి తెలిసిందల్లా చిక్కటి చిరునవ్వుతో చనిపోయిన వారి కుటుంబాలకు డబ్బులు అందించటం మాత్రమేనని ఎద్దేవా చేశారు. నిజంగా ప్రజల బిడ్డే అయితే దాడులు చేసిన సొంత పార్టీ నేతలను కాపాడుకుంటాడా అని ప్రశ్నించారు. మీ బిడ్డే అయితే నష్ట పరిహారాన్ని నవ్వుతూ ఇప్పిస్తాడా అని నిలదీశారు. ప్రజల బిడ్డే అయితే పేదల ప్రాణాలు వెలకట్టే పెత్తందారు అయ్యేవాడా? అని ఆక్షేపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img