Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఉమ్మడి వ్యూహం

. బీజేపీ ఓటమే లక్ష్యంగా విపక్షాల సమావేశం
. బెంగళూరులో విందుకు హాజరయిన నేతలు
. ‘సమైక్యంగా నిలుద్దాం’ నినాదంతో ప్రణాళిక రచన

న్యూదిల్లీ: ఐక్యత కోసం పిలుపుతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిరచే లక్ష్యంతో తమ కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించేందుకు 26 ప్రతిపక్ష పార్టీల అగ్ర నేతలు సోమవారం కీలకమైన చర్చలు ప్రారంభిం చారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరుకు ప్రణాళికలు రచించేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు బెంగళూరు చేరుకున్నారు. మంగళవారం ఉదయం ప్రారంభమయ్యే అధికారిక చర్చల అజెండాను ఖరారు చేసేందుకు చర్చలు జరిగిన విందు సమావేశానికి హాజరయిన వారిలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రులు ఎం.కె.స్టాలిన్‌, నితీశ్‌ కుమార్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ ఉన్నారు. తాజ్‌ వెస్ట్‌ ఎండ్‌ హోటల్‌లో జరిగిన సమావేశానికి ఆహ్వానితుల్లో హాజరుకాని వారిలో ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ మాత్రమే. అయితే ఆయన తన కుమార్తె సుప్రియా సూలేతో కలిసి మంగళ వారం వస్తారని ఆ వర్గాలు తెలిపాయి. ‘ఇది మంచి సమావేశం’ అని మమతా బెనర్జీ అన్నారు. ‘యునైటెడ్‌ వుయ్‌ స్టాండ్‌’ (సమైక్యంగా నిలుద్దాం) అనే నినాదంతో కూడిన భారీ బ్యానర్‌ ముందు నాయకులు కూర్చున్నారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆతిథ్యం ఇచ్చిన ఈ సమావేశంలో బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ (ఆర్‌జేడీ), అఖిలేశ్‌ యాదవ్‌ (ఎస్పీ), ఫరూక్‌ అబ్దుల్లా (ఎన్‌సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), జయంత్‌ చౌదరి (ఆర్‌ఎల్‌డీ) ఉన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు ఇక్కడికి చేరుకున్న నేతలందరికీ ముందుగా ఘనస్వాగతం లభించింది. మల్లికార్జున ఖడ్గే ప్రసంగంతో మంగళవారం ఉదయం సమావేశం ప్రారంభం కానుంది. కాగా, బెంగళూరు వీధుల్లో ‘యునైటెడ్‌ వుయ్‌ స్టాండ్‌’ (సమైక్యంగా నిలుద్దాం) అనే నినాదంతో కాంగ్రెస్‌ నేతలు సోనియా, ఖడ్గే, రాహుల్‌, మమతా బెనర్జీ, ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత ఎం.కె.స్టాలిన్‌ సహా వామపక్ష నేతలు, కొన్ని ప్రాంతీయ పార్టీల నాయకుల పోస్టర్లు వెలిశాయి. సోనియా, రాహుల్‌, మల్లికార్జున ఖడ్గే ప్రత్యేక విమానంలో కర్నాటక రాజధానికి చేరుకున్నారు. వారికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నితీశ్‌ కుమార్‌, హేమంత్‌ సోరెన్‌, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌, తేజస్వీ యాదవ్‌ కూడా మధ్యాహ్నం తర్వాత చేరుకున్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌, అలాగే, శివసేన (యూబీటీ) నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే బెంగళూరు చేరుకున్నారు.
విపక్షాల ఐక్యతకు ‘గేమ్‌ ఛేంజర్‌’: కాంగ్రెస్‌
విపక్షాల ఐక్యత భారత రాజకీయ దృష్టాంతానికి ‘గేమ్‌ ఛేంజర్‌’ అని కాంగ్రెస్‌ నొక్కి చెబుతూ, బీజేపీపై విరుచుకుపడిరది. ప్రతిపక్ష పార్టీలను ఒంటరిగా ఓడిరచాలని మాట్లాడే వారు ఇప్పుడు ‘దెయ్యం’గా మారిన ఎన్‌డీఏకి కొత్త ఊపిరి పోయడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేసింది. ప్రతిపక్షాల సమావేశం జులై 18న దిల్లీలో ఏర్పాటు చేసిన ఎన్‌డీఏ సమావేశంతో సమానంగా ఉంది. ఇక్కడ కొన్ని కొత్త మిత్రపక్షాలు అధికార బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణంలో చేరే అవకాశం ఉంది. కాగా, ఐక్యత గురించి చర్చలు ఉన్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు, ముఖ్యంగా సాంప్రదాయ ప్రత్యర్థులుగా ఉన్న వారి మధ్య విభేదాలు అలాగే ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాలను సయోధ్య చేయడం సవాలుతో కూడుకున్న పని. ప్రతిపక్ష సమావేశానికి వచ్చిన సీపీఎం నేత సీతారాం ఏచూరి పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వామపక్షాలు, కాంగ్రెస్‌తో పాటు లౌకిక పార్టీలు బీజేపీతో పాటు రాష్ట్రంలో టీఎంసీని కూడా ఎదుర్కొంటాయని అన్నారు. అయితే విపక్షాల ఓట్ల చీలికను తగ్గించడమే తమ ప్రయత్నమని, కలిసి పోరాడేందుకు తాము ప్రణాళిక సిద్ధం రూపొందిస్తామని ఏచూరి తెలిపారు. ఇదిలాఉండగా, విపక్ష పార్టీలు లక్ష్యంగా బీజేపీ సోమవారం ఆరోపణలు చేస్తూ, ఇది ‘అవకాశవాదులు, అధికార దాహం’ నాయకుల సమావేశమని, అటువంటి కూటమి ప్రస్తుతం లేదా భవిష్యత్తులో దేశానికి ఎటువంటి మేలు చేయదని పేర్కొంది. అయితే, 26 ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ముందుకు సాగి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకు, ఈ నియంతృత్వ ప్రభుత్వ చర్యలపై ఆందోళనలను పరిష్కరించేందుకు ఇక్కడకు వచ్చాయని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ అన్నారు. దిల్లీ ఆర్డినెన్స్‌, ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) పై చర్చించే అవకాశం ఉంది.
కనీస ఉమ్మడి కార్యక్రమంతో ప్రారంభం
బెంగళూరులో బుధవారం ఉదయం సమావేశం నిర్వహించే ప్రతిపక్ష నాయకులు ఉమ్మడి కనీస కార్యక్రమంపై పనిని ప్రారంభిస్తారు. ఉమ్మడి ఆందోళన ప్రణాళికను ప్రకటిస్తారు. ఉమ్మడి ప్రకటన జారీ చేయడంపై చర్చలు జరపడంతో పాటు మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థులను నిలబెట్టే ప్రతిపాదనపై ముందుకు వెళతారు. సోమవారం సాయంత్రం జరిగే విందు సమావేశం సందర్భంగా చర్చల అజెండా ఖరారు చేస్తారు. సమావేశానికి ముందు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖడ్గే మాట్లాడుతూ విపక్ష కూటమి భాగస్వాములందరూ ఐక్యంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతారని, విభజించే ప్రయత్నాలను అడ్డుకుంటామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడుతూ, ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడానికి తానొక్కడే సరిపోతానని చెప్పిన మోదీ… అలాంటప్పుడు 30 పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని ఆయనకు అనిపిస్తోందన్నారు. మంగళవారం జరగనున్న నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్‌డీఏ) సమావేశాన్ని ప్రస్తావిస్తూ, విపక్షాల కలయికను చూసి బీజేపీ ఉలిక్కిపడిరదని, ఇప్పుడు సంఖ్యాబలం చూపించేందుకు ఇప్పటికే చీలిపోయిన పార్టీలను దరిచేర్చుకుంటోందని ఖడ్గే పేర్కొన్నారు. ‘ప్రధాన మంత్రి రాజ్యసభలో మాట్లాడుతూ ‘మెయిన్‌ అకేలా కాఫీ హూన్‌ సారే ప్రతిపక్షం కే లియే’ అన్నారు. అలాంటప్పుడు 30 పార్టీలను ఎందుకు ఏకతాటిపైకి తెస్తున్నారు. ఈ 30 పార్టీలు ఎవరు, వాటి పేర్లు ఏమిటి, అవన్నీ ఎన్నికల కమిషన్‌లో నమోదయ్యాయి’ అని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయిన ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సమావేశానికి ముందు విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ మాట్లాడుతూ ఎన్‌డీఏకు కొత్త ఊపిరి పోసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ‘ఎన్‌డీఏ గురించి ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. గత కొన్ని రోజులుగా మేము దాని గురించి వింటున్నాము, చదువుతున్నాము. అకస్మాత్తుగా, రేపు ఎన్‌డీఏ సమావేశానికి పిలిచినట్లు సమాచారం. అందుకే దెయ్యంగా మారిన ఎన్‌డీఏ ఇప్పుడు కొత్త ఊపిరి పీల్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని తెలిపారు. పాట్నాలో జరిగిన సమావేశం ఫలితమే ఇది అన్నారు. పాలనలో పూర్తిగా విఫలమై తప్పుడు హామీలతో మోసం చేసిన వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వేణుగోపాల్‌ అన్నారు. అందుకే ఇక్కడికి వచ్చాం. ఇది రెండో సమావేశం. భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ ఉండాలనేది ఈ సమావేశంలో నిర్ణయిస్తామని వేణుగోపాల్‌ తెలిపారు. జులై 20న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయని, అందుకు సంబంధించిన వ్యూహాన్ని కూడా ప్రతిపక్ష పార్టీలు రూపొందిస్తాయని చెప్పారు. ‘ఇది భారత రాజకీయ దృష్టాంతానికి గేమ్‌ ఛేంజర్‌గా మారుతుందని మేము చాలా కచ్చితంగా అనుకుంటున్నాము. పాట్నా సమావేశం తర్వాత ‘మొత్తం ప్రతిపక్షాన్ని ఒంటరిగా ఓడిరచడం మాకు చాలా సౌకర్యంగా ఉంది’ అని చెబుతున్న వారిని చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు సమావేశాలు ప్రారంభించామంటే అదే ప్రతిపక్ష ఐక్యత సాధించిన నిజమైన విజయం’ అని వేణుగోపాల్‌ అన్నారు. కూటమికి నాయకుడెవరు అని వేణుగోపాల్‌ను ప్రశ్నించగా… ‘వివిధ హోదాల్లో తమ సత్తాను నిరూపించుకున్న నాయకులు మనకు కావల్సినంత మంది ఉన్నారని, మీరు నాయకుడి గురించి ఆందోళన చెందకండి, దేశ పరిస్థితి గురించి ఆందోళన చెందండి’ అని అన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ హక్కులు, సంస్థల స్వతంత్ర పరిరక్షణ కోసం ప్రతిపక్ష పార్టీలన్నీ ఉమ్మడి లక్ష్యంతో ఒక్కటయ్యాయని అన్నారు. ‘ఇవన్నీ బీజేపీ ప్రభుత్వం నుంచి దాడికి గురవుతున్నాయి. వారు ప్రతిపక్షాల గొంతును అణిచివేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సీబీఐ వంటి వారి ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారు. రాహుల్‌ గాంధీపై అనర్హత దానికి అతిపెద్ద ఉదాహరణ’ అని వేణుగోపాల్‌ ఆరోపించారు. ‘మహారాష్ట్రలో జరుగుతున్న సంఘటన కూడా దానిని చూపిస్తుంది. వారు ఈ ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం ద్వారా ఎన్నికయిన ప్రభుత్వాలను అస్థిరపరచాలనుకుంటున్నారు’ అని ఎన్‌సీపీలో అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని తిరుగుబాటును ప్రస్తావిస్తూ ఆరోపించారు. గత 75 రోజులుగా మణిపూర్‌ మండుతున్నదని, ప్రధాని మౌనం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని వేణుగోపాల్‌ అన్నారు. కర్నాటక నుంచి బీజేపీ పతనం ప్రారంభమైందని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నొక్కి చెప్పారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి టీఎంసీతో తమ పార్టీకి ఉన్న విభేదాలను ప్రస్తావిస్తూ, ప్రతి రాష్ట్రంలోనూ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. ‘ఈ పరిస్థితుల్లో బీజేపీకి ప్రయోజనం చేకూర్చే ఓట్ల విభజన తక్కువగా ఉండేలా చూడడమే ఈ ప్రయత్నం. ఇదేమీ కొత్త విషయం కాదు. 2004లో మాదిరిగానే వామపక్షాలకు 61 సీట్లు ఉండగా, అందులో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడిరచి 57 స్థానాలను మేము గెలిచాము. ఆ తర్వాత మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు నడిచింది’ అని ఏచూరి తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు, కాంగ్రెస్‌తో పాటు లౌకిక పార్టీలు బీజేపీ, టీఎంసీలకు వ్యతిరేకంగా పోరాడుతాయని, ఇది ఏ రూపంలో ఉంటుందో తర్వాత నిర్ణయించడం జరుగుతుందని అన్నారు. కేంద్రంలో వామపక్ష`కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వచ్చిన 2004 నమూనాను ఏచూరి ప్రస్తావించారు.
ఉప కమిటీ ఏర్పాటుకు యోచన
ఇదిలాఉండగా, 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతిపక్ష కూటమి కోసం ఉమ్మడి కనీస కార్యక్రమం, కమ్యూనికేషన్‌ పాయింట్ల రూపకల్పన కోసం ఉప కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని ఆ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, ర్యాలీలు, సమావేశాలు, ఆందోళనలతో కూడిన పార్టీల ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించడానికి ఉప కమిటీని కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. రాష్ట్రాల వారీగా సీట్ల పంపకాన్ని నిర్ణయించే ప్రక్రియపై చర్చించే ప్రణాళిక సమావేశం ముందుకు రానున్నదని తెలుస్తోంది. ఈవీఎంల సమస్యపై కూడా ప్రతిపక్ష నేతలు చర్చించి ఎన్నికల సంఘానికి సంస్కరణలు సూచించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. విపక్ష నేతలు కూడా కూటమికి పేరు సూచించాలని యోచిస్తున్నారు. జూన్‌ 23న బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పాట్నాలో నిర్వహించిన ప్రతిపక్ష ఐక్యత కోసం జరిగిన చివరి సమావేశానికి కాంగ్రెస్‌, టీఎంసీ, ఆప్‌, సీపీఐ, సీపీఎం, ఆర్‌జేడీ, జేఎంఎం, ఎన్‌సీపీ, శివసేన (యూబీటీ), ఎస్పీ, జేడీయూ సహా 15 పార్టీలు హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన ప్రతిపక్ష పార్టీల మొత్తం బలం లోక్‌సభలో దాదాపు 150కి చేరుకుంది. బెంగళూరు బుధవారం ఉదయం జరిగే విపక్ష పార్టీల సమావేశానికి కొత్తగా ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆర్‌ఎస్‌పీ, సీపీఐ(ఎంఎల్‌), ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఐయూఎంఎల్‌, కేరళ కాంగ్రెస్‌ (జోసెఫ్‌), కేరళ కాంగ్రెస్‌ (మణి), అలాగే, కృష్ణ పటేల్‌కు చెందిన అప్నా దళ్‌ (కామెరవాడి), ఎంహెచ్‌ జవహిరుల్లా నేతృత్వంలోని తమిళనాడు మనితానేయ మక్కల్‌ కట్చి (ఎంఎంకే) హాజరుకానున్నాయి. శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) చీలిక, పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికలలో అనేక మంది ప్రాణాలను బలిగొన్న విస్తృతమైన హింసను చూసిన నేపథ్యంలో ఈ ప్రతిపక్ష పార్టీల సమావేశం జరుగుతుంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఈ రెండో సమావేశం జరగాల్సి ఉండగా, కొండ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా బెంగళూరులోఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img