Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

కృష్ణా నదికి పెరిగిన వరద.. ఆల్మట్టి, నారాయణపూర్‌, భీమాకి భారీగా ఇన్‌ఫ్లోలు

ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌, ఉజ్జయిని, భీమా, తుంగభద్ర, గుగుల్‌ ప్రాజెక్టుల నుంచి దిగువకు లక్షల క్యూసెక్కుల్లో నీటిని వదులుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని ప్రియదర్శిని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.
కాగా, ఇప్పటికే నిండుకుండల్లా ఉన్న ప్రాజెక్టులకు మళ్లీ పెద్ద మొత్తంలో వస్తున్న వరదతో ఇబ్బందిగా మారుతోంది. దీంతో తెలంగాణ ప్రాజెక్టుల నుంచి అంతే మొత్తంలో దిగువకు స్పిల్‌?వే, క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే.. జూరాల, శ్రీశైలం కుడి, ఎడమ గట్ల వద్ద హైడల్‌ పవర్‌ జనరేట్‌ అవుతోంది. ఆల్మట్టికి 1.36లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. దిగువకు 1.50 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ డ్యామ్‌ 25 గేట్లు ఓపెన్‌ చేసి 1.69 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. గూగుల్‌ బ్యారేజ్‌ నుంచి 1.40లక్షల క్యూసెక్కులు జూరాల వైపు వస్తోంది.
ఇవే కాకుండా మహారాష్ట్ర నుంచి వచ్చే భీమా నదికి కూడా వరదలు విపరీతంగా వస్తున్నాయి. దీంతో భీమా నది నుంచి (శాంతి బ్యారేజీ) 98వేల క్యూసెక్కులు జూరాలకు వస్తోంది. దీంతో జూరాల ప్రాజెక్టు నుంచి 43 గేట్లు ఓపెన్‌? చేసి 2.16 లక్షల క్యూసెక్కులతో పాటు భీమా, నెట్టెంపాడు, లెఫ్ట్‌, రైట్‌ కెనాల్‌?, పారలాల్‌ కెనాల్‌, హైడల్‌ పవర్‌కు ఇట్లా మొత్తంగా జూరాల నుంచి అవుట్‌ ఫ్లో 2.49 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఈ నీరంతా నేరుగా వెళ్లి శ్రీశైలంలో కలుస్తోంది. ఇక శ్రీశైలం జలాశాయినికి జూరాల నుంచే కాకుండా అటు తుంగభద్ర నది నుంచి కూడా 59వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img