London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

గోదావరి జలాలు వచ్చేశాయ్‌

‘పట్టిసీమ’ ద్వారా కృష్ణాడెల్టాకు 6,100 క్యూసెక్కుల నీరు
పవిత్రసంగమం వద్ద జలహారతిచ్చిన మంత్రి రామానాయుడు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : కృష్ణాడెల్టాకు గోదావరి జలాలు చేరుకున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల పథకం 17 పంపులద్వారా ప్రస్తుతం 6,100 క్యూసెక్కుల నీరు కృష్ణాలోకి చేరుతుండగా, ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని కుడి, ఎడమ కాల్వల ద్వారా కృష్ణాడెల్టాకు విడుదల చేస్తున్నారు. త్వరలో మరో 8 పంపుల నుంచి నీరు విడుదల చేయనున్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌ వద్ద గోదావరి జలాలు కృష్ణాలో కలిసే పవిత్ర సంగమం వద్ద జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామా నాయుడు… ఎంపీ కేశినేని చిన్ని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులతో కలిసి కృష్ణానదికి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్షా దక్షత, దూర దృష్టికి నిదర్శనం పట్టిసీమ ఎత్తిపోతలని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితు ల్లో కృష్ణాడెల్లా ఆయకట్టుకు ఈ పథకం ఊపిరిపోస్తోందన్నారు. ఆనాడు తెలుగుజాతి బిడ్డ కేఎల్‌ రావు రాష్ట్రాన్ని కరువు కాటకాలు, దుర్భిక్షం నుంచి కాపాడుకోవాలంటే నదుల అనుసంధానం ద్వారానే సాధ్యమని తెలిపారని, ఆ కలలు పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ద్వారా నిజం చేసింది చంద్రబాబేనన్నారు. ఐదు రోజుల క్రితం పట్టిసీమ వద్ద 17 పంపులద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు ఇప్పటివరకు 6,100 క్యూసెక్కులు చేరాయని మంత్రి తెలిపారు. మరో 8 పంపులనుంచి దశలవారీగా విడుదల చేస్తామని… మొత్తంగా 24 పంపుల ద్వారా రోజుకు 8వేల క్యూసెక్కుల నీరు చేరుతుందన్నారు. ఈ నీరు కృష్ణ్ణా డెల్టా లోని 30 లక్షల మంది ప్రజలకు తాగు, 10 లక్షలకు పైగా ఆయకట్టు సాగుకు ఆధారమన్నారు. కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందడం వల్ల శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వచ్చే నీరు రాయల సీమకు పంపే అవకాశం కలుగుతుందని మంత్రి రామానాయుడు తెలిపారు. ఇటువంటి పట్టిసీమను అసెంబ్లీలో ఒట్టి సీమ అన్న జగన్‌… ప్రజలకు, తెలుగుజాతికి క్షమాపణ చెప్పాలని, ఆయనకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదన్నారు. పురుషోత్తపట్నం ద్వారా ఏలేరు రిజర్వాయర్‌కు అందే గోదావరి జలాలు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ తో పాటు, ఆ నగర ప్రజలకు తాగునీరుగా అందుతుందన్నారు. ప్రతి ఏటా వృథా అవుతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేందుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుందనే దూర దృష్టితోనే చంద్రబాబు పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలను నిర్మాణం చేశారన్నారు. ఆనాడు పట్టిసీమ పథకానికి రూ.1300 కోట్లు వెచ్చిస్తే, కృష్ణా డెల్టా లోని 30 లక్షల ఎకరాలకు అందిన సాగునీటి ద్వారా 50 వేల కోట్లు వరకు రైతులకు ఆదాయం సమకూరిందని మంత్రి వివరించారు. జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో పట్టిసీమను నిర్లక్ష్యం చేశారని, స్వార్థ రాజకీయాలతో పులిచింతల రిజర్వాయర్‌ ఖాళీ చేశారని మంత్రి విమర్శించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img