Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

పొత్తు పొడిచింది

. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఎన్డీఏలోకి టీడీపీ
. దిల్లీలోనే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మకాం
. బీజేపీ అగ్రనేతలతో సీట్ల కేటాయింపుపై చర్చలు
. ఎంపీ సీట్లపై కమలనాథుల పట్టు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:ఎట్టకేలకు అందరూ ఊహించినట్లుగానే బీజేపీతో టీడీపీ ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌(ఎన్డీఏ) కూటమిలో తెలుగుదేశం పార్టీ మళ్లీ చేరబోతుంది. 2014 తర్వాత…వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ- బీజేపీతో కలిసి పోటీ చేయనుంది. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రత్యక్షంగా పోటీ చేయలేదు. కేవలం బయట నుంచి మద్దతు మాత్రమే తెలియజేసింది. తొలుత 1999లో బీజేపీతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు…రాష్ట్ర విభజన తర్వాత కూడా బీజేపీతో కలిసి ప్రయాణం చేశారు. 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగా, బీజేపీ భాగస్వామిగా ఉంది. అలాగే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యపక్షంగా వ్యవహరించింది. 2018లో రాష్ట్రానికి నిధులు, విభజన అంశాల అమలు విషయంలో టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు వచ్చాయి. ఆ సమయంలో కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చింది. 2019లో కేంద్రంలో ఎన్డీఏ మరోసారి విజయం సాధించగా, ఏపీలో వైసీపీ అనూహ్యమైన మెజార్టీతో గెలుపొందింది. ఆ తర్వాత టీడీపీ- బీజేపీ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. మరలా ఆరేళ్ల తర్వాత రెండు పార్టీలు జనసేనతో కలిసి ప్రజల్లోకి వెళ్లబోతున్నాయి. ఇక ఎన్నికల పొత్తు, సీట్ల సర్దుబాట్లపై దిల్లీ పెద్దలతో చర్చించేందుకు గురువారం దిల్లీ చేరుకున్న టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ బీజేపీ అగ్ర నేతలు జేపీ నడ్డా, అమిత్‌షాలతో భేటీ అయ్యారు. గురువారం అర్థరాత్రి దాదాపు గంటన్నరపాటు సీట్ల సంఖ్య, ఏఏ నియోజకర్గాలు కేటాయించాలన్నదానిపై సుదీర్ఘ చర్చలు సాగాయి. బీజేపీ అగ్రనేతలు ఎంపీ సీట్లు అధికంగా కోరుతుండగా, దానివల్ల ప్రత్యర్థి పార్టీ లాభపడే అవకాశం ఉందని చంద్రబాబు విశ్లేషించి వారికి వివరించినట్లు తెలిసింది. ఏపీ నుంచి పోటీచేసే ఎంపీ అభ్యర్థులు ఎవరెవరు? ఏ ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని వారు ఆశిస్తున్నారు? ఆయా స్థానాల్లో వైసీపీ అభ్యర్థులెవరు? వారిని బీజేపీ అభ్యర్థులు ఢీకొనగలరా? తదితర అంశాలు వారి మధ్య చర్చకొచ్చినట్లు తెలిసింది. అయితే సీట్ల సంఖ్యపై రెండు పార్టీల మధ్య స్పష్టత రాకపోవడంతో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ దిల్లీలోనే మకాం వేశారు. పోటీ చేసే స్థానాల గురించి సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ- జనసేన మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. జనసేనకు 3 ఎంపీ సీట్లు, 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించగా, 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను జనసేన ప్రకటించింది. 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. ఎంపీ అభ్యర్థులను మాత్రం టీడీపీ, జనసేన ఇంతవరకు ప్రకటించలేదు. బీజేపీ కోరుకునే స్థానాలు ఖాయమైన తర్వాతే మలి జాబితా విడుదల చేయాలని చంద్రబాబు, పవన్‌ నిర్ణయించారు. 9 అసెంబ్లీ, 7 లోక్‌సభ సీట్లను బీజేపీ గట్టిగా అడుగుతున్నట్లు తెలుస్తోంది.
శ్రీకాళహస్తి, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, విశాఖ (నార్త్‌), ఏలూరు, రాజమండ్రి, అరకు, విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ స్థానాలతోపాటు తిరుపతి, రాజంపేట, రాజమండ్రి, అరకు, నరసాపురం, విశాఖ లేదా విజయవాడ లోక్‌సభ సీట్లను బీజేపీ కోరుతున్నట్లు సమాచారం. చంద్రబాబు మాత్రం 6 అసెంబ్లీ స్థానాలు, నాలుగు లేదా ఐదు పార్లమెంటు స్థానాలు కేటాయించడానికి సుముఖంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. శుక్రవారం రాత్రి అమిత్‌షా, నడ్డాలతో దీనిపై మరోసారి చర్చలు జరపాలని ప్రయత్నించినప్పటికీ అవకాశం దక్కకపోవడంతో భేటీ శనివారానికి వాయిదా పడిరది. అమిత్‌ షా శనివారం పాట్నా వెళ్లే ముందు చంద్రబాబు కలిసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 10వ తేదీన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యర్థులను ప్రకటించనుంది. ఆ లోపు టీడీపీ జనసేనతో బీజేపీ సీట్ల సర్దుబాటు వ్యవహారం ఖరారయ్యే అవకాశం ఉందని, రేపో, మాపో టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరినట్లు అధికారిక ప్రకటన రానుందని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ మీడియాకు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img