London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

బీజేపీ దాతల్లోజీఎంఆర్‌దే పెద్ద వాటా

‘ప్రుడెంట్‌’ ద్వారా వందల కోట్ల ఎన్నికల నిధులు సమకూరిన వైనం

న్యూదిల్లీ: ఉత్తర భారతాన్ని వర్షాలు ముంచేస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీ సహా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలను తట్టుకోలేక దిల్లీ విమానాశ్రయం పైకప్పులో కొంత భాగం కుప్పకూలింది. రాజ్‌కోట్‌, జబల్‌పూర్‌లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం పైకప్పులోనూ లీకేజిలు దర్శనమిచ్చాయి. ఆలయానికి వెళ్లే మార్గాలన్నీ నీటమునిగాయి. రోడ్లపై పెద్ద గంటలు ఏర్పడ్డాయి. తీవ్రమైన వాతావరణ పరిస్థితలే ఇందుకు కారణమంటూ చేతులు దులుపుకునే ప్రయత్నాన్ని కేంద్రప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులు చేశారు. మౌలికవసతుల ఏర్పాటులో జరిగిన అవినీతిని, పట్టణ నిర్మాణ ప్రణాళికలో, పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలను పూర్తిగా కప్పిపుచ్చుతూ ప్రకృతిపై నెపం నెట్టేస్తున్నారు. బీజేపీకి భారీగా నిధులు సమకూర్చిన సంస్థ నిర్మించిన టెర్మినల్‌ వన్‌ పైకప్పు పాక్షికంగా కూలి ఒకరు చనిపోయారు. దీనిపై ఆ సంస్థకు జవాబుదారీ లేదనట్లుగా కేంద్రం వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిచ్చింది. వాస్తవానికి దిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ను జీఎంఆర్‌ గ్రూపు నిర్మించింది. ఇందుకోసం రూ.12వేల కోట్లు ఖర్చు అయింది. విమానాశ్రయం నిర్వహణ బాధ్యతలు కూడా జీఎంఆర్‌వే కాగా తాజా ఘటనపై తమకు జవాబుదారీ లేనట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది.
2018 నుంచి ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ ద్వారా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి భారీగా నిధులను జీఎంఆర్‌ గ్రూపు సమకూరుస్తోంది. బీజేపీ ఎన్నికల నిధిలో అధిక వాటా కూడా ఈ సంస్థదే అంటే అతిశయోక్తి కాదు. ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల బాండ్ల దాతల్లో జీఎంఆర్‌ పేరు లేదు. ఈ సంస్థ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా బీజేపీకి నిధులు సమకూరుస్తున్నది. 15 ఎలక్టోరల్‌ ట్రస్టుల్లోనే ధనిక ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ ద్వారా బీజేపీకి జీవీఆర్‌ విరాళాలు అందుతాయి. ఈ ట్రస్టు నుంచి అత్యధిక ప్రయోజనం పొందే పార్టీ కూడా బీజేపీనే కావడం గమనార్హం.
ఏప్రిల్‌లో వెలువడిన రాయిటర్స్‌ నివేదిక ప్రకారం 2013లో ఏర్పాటైన ప్రుడెంట్‌ ట్రస్టు ఈ ఏడాది మార్చిలో 272 మిలియన్‌ డాలర్ల విరాళాలు పొందింది. ఇందులో నుంచి 75శాతం బీజేపీకి మళ్లించింది. కార్పొరేట్‌ దాతలు వ్యక్తిగతంగా ఇచ్చే విరాళాలను ఏ విధంగా పంపిణీ చేస్తారన్నది ప్రుడెంట్‌ వెల్లడిరచలేదు. 2018 నుంచి 2023 వరకు భారత్‌లోని అతిపెద్ద కంపెనీల నుంచి నిధులు పొందినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఎనిమిది దిగ్గజ వాణిజ్య సంస్థలు 50 మిలియన్‌ డాలర్లను 201923లో విరాళమివ్వగా, ఆ మొత్తాన్ని చెక్కుల రూపేణ బీజేపీకి అందజేసినట్లుగా రాయిటర్స్‌ వెల్లడిరచింది. ఎనిమిదిలో నుంచి నాలుగు కంపెనీలను ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్సర్‌, జీఎంఆర్‌గా గుర్తించింది. బీజేపీకి నిధులను ఈ కంపెనీలు ప్రత్యక్షంగా ఇవ్వని కారణంగానే దాతల జాబితాలో వీటి పేర్లు లేవని వెల్లడిరచింది. నిధి పంపిణీపై జీఎంఆర్‌ అధికార ప్రతినిధి స్పందిస్తూ అంతర్గత మార్గదర్శకాల ఆధారంగా ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలన్నది ప్రుడెంట్‌ నిర్ణయిస్తుందని, దీని గురించి తనకు తెలియదని చెప్పారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు పెట్టుకోవడం కంపెనీకి ఇష్టంలేదని ఆయన చెప్పినట్లు రాయిటర్స్‌ తెలిపింది. అయితే రికార్డులు వేరొక కథ చెబుతున్నాయి. బీజేపీకి అత్యధిక నిధులు ప్రుడెంట్‌ నుంచి వచ్చాయంటున్నాయి. ప్రుడెంట్‌ విరాళాలు ఇతర పార్టీలకూ అందుతాయి కానీ అన్నింటికంటే ఎక్కువగా బీజేపీ ఖాతాలో చేరుతాయని రాయిటర్స్‌ నివేదించింది. దిల్లీ విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ వన్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించిన నెలలో రాయిటర్స్‌ నివేదిక విడుదలైంది. దిల్లీ ఎయిర్‌పోర్టు విస్తరణ పనులను 2019లో జీఎంఆర్‌, దిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (డీఐఏఎల్‌) చేపట్టాయి. తమకు అతిపెద్ద దాతగా ప్రుడెంట్‌ పేరును 2019లో ఈసీకి బీజేపీ తెలిపింది. ప్రూడెంట్‌లో అతిపెద్ద భాగస్వామిగా జీఎంఆర్‌తో పాటు భారతీ ఎంటర్‌ప్రైజెస్‌, డీఎల్‌ఎఫ్‌ ఉన్నట్లు ఇండియా టుడే కూడా అప్పట్లో నివేదించింది. ఏడీఆర్‌ నివేదికల ప్రకారం.... బీజేపీకి అతిపెద్ద దాతగా ప్రుడెంట్‌ ఉన్నట్లు ఏడీఆర్‌ కూడా పేర్కొంది. 201819 ఎలక్టోరల్‌ ట్రస్ట్‌పై నివేదికలో ప్రుడెంట్‌ పేరును ప్రముఖంగా పేర్కొంది. ప్రూడెంట్‌లో అతిపెద్ద వాటాదారు సంస్థలుగా జీఎంఆర్‌ గ్రూపు, భారతీ ఎయిర్‌టెల్‌, డీఎల్‌ఎఫ్‌, అపోలో టైర్స్‌ ఉన్నాయని ఏడీఆర్‌ నివేదించింది. జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌… 201819లో ఎలక్టోరల్‌ ట్రస్టులకు వ్యక్తిగత దాతలు, కార్పొరేట్లు ఇచ్చిన విరాళాలలో నుంచి అత్యధికంగా రూ.25 కోట్లను అందజేసింది. అదే సంవత్సరం రూ.67.25 కోట్లు బీజేపీకి ప్రుడెంట్‌ సమకూర్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి రూ.154.30 కోట్లు ఇచ్చింది. 201920లోనూ ప్రుడెంట్‌ ట్రస్ట్‌ ద్వారా రూ.217.75 కోట్లు బీజేపీకి సమకూరాయి. 202122లో కార్పొరేట్‌ విరాళాల్లో నుంచి భారీ వాటా బీజేపీకి మళ్లించింది. మొత్తం రూ.336.509 బీజేపీకి ప్రుడెంట్‌ ఇవ్వగా ఇందులో రూ.20కోట్లు జీఎంఆర్‌ నుంచి వెళ్లినట్లు ఏడీఆర్‌ వెల్లడిరచింది. 202223లోనూ ఇదే తరహాలో తమకు వచ్చిన కార్పొరేట్‌ నిధి మొత్తం రూ.360 కోట్లలో నుంచి రూ.256.25 కోట్లను బీజేపీకి ప్రుడెంట్‌ అందించింది. ఆ ఏడాది బీజేపీకి వచ్చిన ఎన్నికల నిధి మొత్తం 259.08 కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img