Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

మైక్రాన్‌తో ఒప్పందం…
మేకిన్‌ ఇండియాకు తూట్లు

రూ.15 వేల జీతానికి రూ.3.18 కోట్లు ఖర్చా
మైక్రాన్‌కే యాజమాన్య హక్కులలో మర్మమేమిటీ

న్యూదిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా అంతర్జాతీయ చిప్‌ తయారీ సంస్థ మైక్రాన్‌తో కుదుర్చుకొన్న ఒప్పందం మన దేశానికి ఏమాత్రం మేలు చేయదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పైగా, ఈ ఒప్పందం ద్వారా ‘మేకిన్‌ ఇండియా’ పథకానికి మోదీ సర్కార్‌ తూట్లు పొడుస్తున్నది. ఈ కంపెనీ ఏర్పాటుకు 70 శాతం నిధులను కేంద్రం భరిస్తున్నప్పటికీ 30 శాతం నిధులు వెచ్చిస్తున్న మైక్రాన్‌కే యాజమాన్య పగ్గాలు అప్పగించడంలో మర్మం ఏమిటో తెలియక విశ్లేషకులు తలలుబాదుకుంటున్నారు. కంపెనీ ఏర్పాటుకు 70 శాతం నిధులను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నప్పటికీ, 30 శాతం నిధులను వెచ్చిస్తున్న మైక్రాన్‌కే యాజమాన్య పగ్గాలు దక్కనున్నట్టు ఒప్పందంలో ఉన్నది. ఈ రంగంలో ఒక్కో ఉద్యోగానికి సగటున రూ.15 వేలు వేతనంగా ఇస్తున్నారు. అంటే రూ.15 వేల జీతం వచ్చే 5 వేల ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం రూ.15,902 కోట్లను ఖర్చుపెడుతున్నట్టు లెక్క. ఒక్కో ఉద్యోగానికి రూ. 3.18 కోట్లు కేంద్రం ఖర్చు చేస్తున్నది. 9.5 శాతం సబ్సిడీకి అమెరికాలో, 40 శాతం సబ్సిడీకే జపాన్‌లో కంపెనీ పెట్టేందుకు మైక్రాన్‌ ఒప్పుకొన్నది. 70 శాతం సబ్సిడీ ఇచ్చి కంపెనీ పగ్గాలను అప్పగించాలని ఆ కంపెనీ షరతులు విధించగా, మోదీ సర్కారు ‘జీ హుజూర్‌’ అంటూ పచ్చజెండా ఊపడంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఒప్పందంలో చిప్‌ల తయారీ లేదు. కేవలం అసెంబ్లింగ్‌, టెస్టింగ్‌, మార్కింగ్‌, ప్యాకింగ్‌ మాత్రమే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చిప్‌ ‘ప్యాకింగ్‌’ ,‘డెలివరీ’ అన్నమాట. ఇలాంటి ఒప్పందాన్ని గొప్ప డీల్‌గా చిత్రీకరించడం, దీనికోసం రూ.16 వేల కోట్ల దేశ సంపదను అమెరికా కంపెనీకి కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.గత నెలలో అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ ‘మైక్రాన్‌ టెక్నాలజీస్‌’తో ఒప్పందం చేసుకోగానే కేంద్రమంత్రులు సహా బీజేపీ పరివారమంతా గప్పాలకు పోయి ప్రకటనలు గుప్పించారు. ‘మైక్రో చిప్‌ తయారీ అడ్డాగా భారత్‌ మారనున్నది. దేశంలో మెమోరీ చిప్‌ల ప్రవాహం మొదలవనున్నది. 5 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇది మోదీజీ సాధించిన దౌత్య విజయం’ అని ఊదరగొట్టారు అయితే, ఈ ఒప్పందం భారత్‌కు నష్టదాయకమని, ‘మేకిన్‌ ఇండియా’ నినాదాన్ని ‘ప్యాకింగ్‌ ఇండియా’గా మార్చడంలో భాగమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. చిప్‌ అసెంబ్లింగ్‌, ప్యాకేజింగ్‌కి రూ.22,717 కోట్లతో గుజరాత్‌లో కర్మాగారం ఏర్పాటు చేసేలా మైక్రాన్‌ టెక్నాలజీస్‌తో ఒప్పందం కుదిరింది. మొత్తం విలువలో 50 శాతం నిధులు అంటే రూ. 11,359 కోట్లు కేంద్రం, మరో 20 శాతం నిధులు అంటే రూ. 4,543 కోట్లను గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందించనున్నది. 30 శాతం నిధులు అంటే రూ.6,815 కోట్లను కంపెనీ భరించాలి. కంపెనీ ఏర్పాటుతో 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్టు కేంద్రం ఆర్భాటంగా చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img