Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వైసీపీ అరాచక పాలనను అంతమొందించాలి

రాజంపేట ‘ఇండియా’ అభ్యర్థులను గెలిపించాలి
సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

విశాలాంధ్ర – రాజంపేట : ప్రజా దర్బార్‌ కూల్చివేతతో మొదలైన జగన్‌మోహన్‌ రెడ్డి విధ్వంసక పాలన అవినీతి, అరాచకాలతో సాగిందని, వైసీపీ అరాచక, దౌర్జన్య పాలనను అంతమొందించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పిలుపునిచ్చారు. శనివారం రాజంపేటలోని ఏఐటీయూసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో తనకు 1970 నుంచి ఆత్మీయ పరిచయం ఉందని, ఆయనలోని ఒక్క సుగుణం కూడా తనయుడు జగన్‌మోహన్‌ రెడ్డికి రాలేదని విమర్శించారు. వైసీపీ ఐదేళ్ల పాలన భూ మాఫియా, ఇసుక, మద్యం, మైనింగ్‌ మాఫియాలతో సాగిందన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్రంలోని బీజేపీ వద్ద మోకరిల్లి ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర అభివృద్ధిని అటకెక్కించారని విమర్శించారు. రాజంపేటలో వైసీపీ నాయకుల ఇసుక అక్రమ రవాణా కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయిం దన్నారు. జగన్‌ తల్లి, చెల్లి, బాబాయిలను మోసగించి తాను అమాయకుడునని చెప్పుకుంటున్నారని అన్నారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవీ కాలంలో కాంగ్రెస్‌ పార్టీని అధః పాతాళానికి నెట్టేశారని విమర్శించారు. ప్రపంచ శాంతి సంఘం నుంచి కడపకు గతంలో అవార్డు దక్కిందని, అటువంటి ఉమ్మడి జిల్లాలో రాజంపేట నుంచి మొట్టమొదటి శాసన సభ్యుడిగా సీపీఐకి చెందిన పంజం నరసింహారెడ్డితో సీపీఐ ప్రస్థానం ఘనంగా సాగిందని గుర్తు చేశారు. నేడు అదే సీపీఐ నుంచి ఇండియా కూటమి అసెంబ్లీ అభ్యర్థిగా బుక్కే విశ్వనాథ నాయక్‌ బరిలో నిలిచారని, ఉత్సాహవంతుడు, యువకుడు, మరీ ముఖ్యంగా శ్రామిక వర్గం నుంచి వచ్చిన నాయకుడు అయినందున పేద ప్రజల గళం చట్ట సభలలో వినిపిస్తాడని తెలిపారు. సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వనాథ నాయక్‌, కాంగ్రెస్‌ పార్లమెంటు అభ్యర్థి బషీద్‌ను నియోజకవర్గ ప్రజలు ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి పి.ఎల్‌.నరసింహులు, సహాయ కార్యదర్శి మహేష్‌, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్వేలి రవికుమార్‌, నియోజకవర్గ కార్యదర్శి ఎం.ఎస్‌. రాయుడు, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి సికిందర్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img