Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సహజీవన బంధాలను రిజిస్టర్‌ చేయాలంటూ పిటిషన్‌..సుప్రీం ఆగ్రహం

సహజీవనాలపై దాఖలైన ఓ పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఆ సంబంధాలను రిజిస్ట్రేషన్‌ చేసేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఓ మూర్ఖత్వపు ఆలోచన అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ఈ మేరకు పిటిషన్‌ను సోమవారం కొట్టివేసింది. దేశంలోని ప్రతి లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌ను తప్పనిసరిగా నమోదుచేసుకునేలా మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ ఓ న్యాయవాది పిల్‌ దాఖలు చేశారు. అంతేకాదు, సహజీవనంలో ఉన్నవారికి సామాజిక భద్రత కల్పించాలని కోరాడు. దీని వల్ల లివ్‌ ఇన్‌ భాగస్వాముల నేరాలు తగ్గుతాయని పేర్కొన్నాడు.ఈ పిల్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏంటి ఇది? ఇక్కడికి కొంత మంది దేనికి వస్తారు. మేము అలాంటి సందర్భాలలో జరిమానా విధించాల్సి వస్తుంది… ఎవరితో రిజిస్ట్రేషన్‌? కేంద్ర ప్రభుత్వమా? లివ్‌-ఇన్‌ రిలేషన్‌ షిప్‌లో ఉన్న వ్యక్తులతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఏమిటి?.. మీరు ఈ వ్యక్తులకు భద్రతను పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నారా లేదా లివ్‌-ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉండొద్దని అనుకుంటున్నారా? ఇటువంటి పిటిషన్లకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.. కేవలం ఇది బుద్దిలేని ఆలోచన.. దీనిని కొట్టిపారేస్తున్నాం’ అని ప్రధాన న్యాయమూర్తి మండిపడ్డారు.లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌ రిజిస్ట్రార్‌గా కేంద్రం ఉండాలని పిటిషనర్‌ కోరగా.. ‘ఏ కారణాలతో భద్రత కల్పించాలనుకుంటున్నారు’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రశ్నించారు. దీనికి లాయర్‌ సామాజిక భద్రత అని సమాధానం ఇవ్వగా… సీజేఐ వెంటనే తిరస్కరించారు. ఇటీవల లివ్‌ ఇన్‌ పాట్నర్స్‌ నేరాల వెలుగులోకి ముఖ్యంగా ఢల్లీిలో శ్రద్ధా వాకర్‌ హత్య ఘటన నేపథ్యంలో ఈ పిటిషన్‌ దాఖలు చేయడం గమనార్హం. ప్రియురాలు శ్రద్ధా వాకర్‌ను ప్రియుడు అఫ్తాబ్‌ పూనావాలా హత్య చేసి.. ఆమె శవాన్ని 35 ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. ఒక్కొక్కటిగా వాటిని ఢల్లీి సమీపంలోని అడవుల్లో విసిరేశాడు. గతేడాది మే 18న చోటుచేసుకున్న ఈ ఘటన.. ఆరు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img