Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

సీపీఐ చరిత్రను ఈసీ పట్టించుకోలేదు

జాతీయ పార్టీ హోదా రద్దుపై భారత కమ్యూనిస్టు పార్టీ

న్యూదిల్లీ: జాతీయ హోదాను రద్దు చేసేముందు ఎన్నికల సంఘం(ఈసీ) తమ పార్టీ చరిత్రను పట్టించుకోలేదని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) పేర్కొంది. జాతీయ పార్టీ హోదాను రద్దు చేసే ముందు సీపీఐకి ఉన్న ఘనచరిత్రను ఈసీ పరిగణనలోకి తీసుకోవాల్సిందని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గం అభిప్రాయపడిరది.ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘స్వాతంత్య్ర సమరంలో సీపీఐ పోరాటాన్ని పరిగణనలోకి తీసుకొని ఉండాల్సింది. దేశంలోని పురాతన పార్టీల్లో సీపీఐ ఒకటి. పాన్‌ ఇండియా ఉనికి సీపీఐకి సొంతం. పార్టీకి ప్రజాదరణ ఉంది. భారత ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకునే ముందు పార్టీకి గల గొప్ప చరిత్రను గుర్తుచేసుకోకపోవడం బాధించింది. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా సీపీఐ అగ్రభాగాన నిలిచి పోరాడిరది. స్వతంత్ర భారతంలో జాతీయ అజెండా రూపకల్పనలోనూ కీలకంగా వ్యవహరించింది. భారతదేశ ప్రజాస్వామిక పరిపాలన బలోపేతానికి ముందు వరుసలో నిలబడిరది. దేశం కోసం నిబద్ధతతో పని చేయడాన్ని పార్టీ కొనసాగిస్త్తోంది. ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటుంది. జాతీయ పార్టీ హోదాను ఉపసంహరించుకున్నప్పటికీ సీపీఐ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుంది. దేశ ప్రజల కోసం నిబద్ధతతో పనిచేస్తుంది. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా ఇంద్రజిత్‌ గుప్తా కమిటీ సిఫార్సు చేసిన విధంగా ఎన్నికల సమగ్ర సంస్కరణలు, దామాషా పద్ధతిలో ఎన్నికల నిర్వహణ, ఎన్నికల బాండ్ల రద్దు, ఎన్నికలకు ప్రభుత్వమే నిధులు సమకూర్చవడం వంటి వాటి కోసం పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది’ అని ఆ ప్రకటన పేర్కొంది. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా వాటిని అధిగమించే సత్తా సీపీఐకి ఉన్నదని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img