Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

హైదరాబాద్‌కు బైబై

. ఏపీ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం
. విభజన చట్టం అంశాలపై నిర్లక్ష్యం
. పదేళ్లయినా పూర్తికాని వివాదాలు
. కలగానే ప్రత్యేక హోదా

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌తో ఆంధ్రులకు బంధం ఆదివారంతో ముగిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి... నవ్యాంధ్రగా ఏర్పడి పదేళ్లు అయినప్పటికీ, ఎక్కడి సమస్యలు అక్కడే మిగిలిపోయాయి. నేడు ఉమ్మడి రాజధాని సైతం దూరమైంది. పదేళ్లల్లో రెండు ప్రభుత్వాల కాలం పూర్తయినా విభజన చట్టం హామీలు అమలుకు నోచుకోలేదు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమేనన్న విమర్శలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం2014 ఆధారంగా జూన్‌ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వేర్వేరుగా విడిపోయాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌పై పదేళ్లపాటు హక్కు కల్పించారు. విభజన సమయంలో అప్పులు ఆంధ్రాకు, ఆస్తులు తెలంగాణకు వెళ్లిపోయాయి. తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, ఉద్యోగుల పంపకాలపై స్పష్టత రాలేదు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ గుదిబండగా మారింది. అపెక్స్‌ కమిటీలు, నదీ యాజమాన్య బోర్డుల మధ్యే నలుగుతున్నదని, దీనిపై కేంద్రం ఎటూ తేల్చడంలేదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాపోతున్నారు. విభజన చట్టం తొమ్మిదవ షెడ్యూల్‌లోని ప్రభుత్వ సంస్థలు, 10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజన తేలలేదు. 68 సంస్థల విభజనకు ఎలాంటి అభ్యంతరం లేదని నాడు తెలంగాణ రాష్ట్రం తెలిపినప్పటికీ… రాష్ట్ర ప్రభుత్వం ముందుకురాకపోవటంతో వాటి విభజన పూర్తికాలేదన్న ప్రచారముంది. ఆస్తుల పంపిణీ వివాదాలు, ప్రభుత్వ కార్యాలయాల స్వాధీనం ఇంకా పరిష్కరించకపోవడం సిగ్గుచేటుగా మారింది. స్థానికత ఆధారంగా ఉద్యోగులను కేటాయించాలని ఉద్యోగసంఘాలు కోరినప్పటికీ, తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు దానిపై దృష్టి పెట్టలేదు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను గాలికొదిలేశారు. ఇన్ని సమస్యలు పరిష్కారం కాకుండానే హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా కోల్పోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు భవిష్యత్తులో అనేక కష్టాలు ఎదురవుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులు, యువతకు భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులు ఎదురవుతాయి. పదేళ్లల్లో ఏపీకి రాజధాని కూడా లేకుండా పోయింది. విభజన చట్టం ఆధారంగా నిర్మించాల్సిన కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టు నిర్మాణం కొనసాగలేదు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావనేలేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని ఏడు వెనుకబడిన జిల్లాలకు ఐదేళ్లకు కలిపి బుందేళ్‌ఖండ్‌ తరహాగా ప్రత్యేక ప్యాకేజీ రూ.24,350 కోట్లు ప్రకటించగా, దాని నిమిత్తం ఏడేళ్లల్లో ఏపీకి కేవలం రూ.1,750 కోట్లు మాత్రమే ఇచ్చి రాష్ట్రానికి కేంద్రం పూర్తిగా దగా చేసింది. దీంతోపాటు రూ.3,820 కోట్ల పన్నుల రూపంలో రాష్ట్రానికి రావాల్సినవి ఆగిపోయాయి. దీనికి కారణం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయకపోవడమేనన్న విమర్శలున్నాయి. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరంతోపాటు విశాఖ రైల్వేజోన్‌, విజయవాడ, విశాఖ మెట్రో రైల్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌, ఆయిల్‌ రిఫైన్‌, తదితర హామీలు మరుగున పడిపోయాయి. నాడు పార్లమెంట్‌ సాక్షిగా అప్పటి ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. విభజన చట్టం సమయంలో విడిపోయిన నవ్యాంధ్రకు రిసోర్స్‌ గ్యాప్‌ను తొలి సంవత్సరం అనగా 2014`15కుగాను కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టి పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. దాని ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రిసోర్స్‌ గ్యాప్‌పై రూ.32,625 కోట్ల అంచనాలు లెక్కగట్టి కేంద్రానికి నివేదించింది. దానిపై ఇప్పటివరకు కేవలం రూ.5,617కోట్లు మాత్రమే మంజూరైందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వెల్లడిరచారు. దీంతోపాటు రూ.3,820 కోట్ల్లు పన్నుల రూపంలో రాష్ట్రానికి రావాల్సినవి ఆగిపోయాయి. సెక్షన్‌ (94) ప్రకారం పారిశ్రామిక రంగాభివృద్ధి కోసం కల్పించిన ఇన్‌సెంటివ్‌లు ఇవ్వలేదు. కేంద్ర విద్యా సంస్థలను ఏర్పాటు చేసినప్పటికీ, వాటికి పూర్తిస్థాయి మౌలిక సౌకర్యాల్ని కల్పించలేదు. ఐఐటీ, ఎన్‌ఐటీ, సెంట్రల్‌ యూనివర్సిటీలను నెలకొల్పి పదేళ్లు అయినప్పటికీ వాటిని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దలేదు. రాష్ట్రంపై ప్రేమ, నిబద్దత, నా రాష్ట్రం, నా ప్రజల అభివృద్ధి అనే లక్ష్యాన్ని నేతలు మరిచారు. పదేళ్లయినా విభజన గాయం నుంచి ఆంధ్రప్రదేశ్‌ కోలుకోలేదు. కేంద్ర సంస్థల కొరత, కొత్త కంపెనీల ఆశలు, ఇవన్నీ అందని ద్రాక్షగా మారాయి. ఇప్పటికైనా విభజన చట్టం అంశాల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా కృషి చేయాల్సిన అవసరముంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img