Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పదవి కాలం ముగిసే వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలకు అండగా ఉంటా


పార్టీ మారను….. ప్రతిపక్షంలోనే ఉంటా
జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు గౌరవ వేతనం ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్

ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
విశాలాంధ్ర – ఆమనగల్లు : పదవి కాలం ముగిసే వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలకు అండగా ఉంటానని ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.
రాష్టంలోని జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు గౌరవ వేతనం ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలో వాస్తవం లేదని, పదవి కాలం ముగిసే వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలకు అండగా శాసన సభలో బిఆర్ఎస్ పార్టీ తరపున ప్రస్తవిస్తానని పేర్కొన్నారు. సోమవారం ఆమనగల్లు పట్టణ కేంద్రములో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ నెల 4న పదవి కాలం ముగియనున్న జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు ప్రజా సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్బంగా వివిధ గ్రామాల్లో 5సంవత్సరాలపాటు వారు అందించిన ప్రజా సేవను గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులకు (జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ)కనీస గౌరవ గౌరవ వేతనం ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. అనంతరం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రూప్ 2, డీఎస్సీ పోస్టులు పెంచాలని నిరుద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.కరోనా సమయంలో కార్పొరేట్ ఆసుపత్రుల పేరుతో కోట్లు గడిచిన వ్యక్తులు రాజకీయాలలోకి వచ్చి ప్రవచనాలు చెప్పడం దురదృష్టకరమన్నారు. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి మానవసేవే మాధవ సేవ అని సేవలు అందిస్తున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ సేవలు అభినందనీయమన్నారు. పదవికే విరామం కానీ సేవకు విరామం కాదని పదవీకాలం ముగుస్తున్న ప్రజా ప్రతినిధులు భావించి ప్రజాసేవలో జీవితాంతం కొనసాగాలని సూచించారు.
కల్వకుర్తి, వెల్డండ, ఆమనగల్లు, మాడ్గుల, కడ్తాల్, తలకొండపల్లి మండలాల స్థానిక ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉప్పల వెంకటేష్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు అనురాధ,దశరథ నాయక్, ఎంపీపీలు నిర్మల, విజయ, రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ రెడ్డి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img