Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అధికార రాజకీయాలు వద్దు

. ఆధునిక సమసమాజ స్థాపనకు కృషి చేయాలి
. శాంతి భద్రతలను పరిరక్షించడం మన బాధ్యత
. ఎస్‌సీఓ సదస్సులో జిన్‌పింగ్‌

బీజింగ్‌: అంతర్జాతీయ పరిపాలన వ్యవస్థ మరింత న్యాయంగా, సమానంగా ఉండేందుకు ఆధిపత్యవాదాన్ని, అధికార రాజకీయాలను తిరస్కరించాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. సమాన హక్కులు, సమాన అవకాశాలకు హామీనిచ్చే విధంగా ఆధునిక సమ సమాజ స్థాపనకు కృషిచేయాలని అన్నారు. బహుపాక్షికవాదాన్ని జిన్‌పింగ్‌ సమర్థించారు. అంతర్జాతీయ పరిపాలన వ్యవస్థ మెరుగవ్వాలన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన షాంఘై సహకార సంఘం (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సులో వీడియో లింక్‌ ద్వారా జిన్‌పింగ్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి, బెలారస్‌ అధ్యక్షుడు అలగ్జాండర్‌ లుకాషెంకో, కజకస్తాన్‌ అధ్యక్షుడు ఖాసీం జోమార్ట్‌ టోకాయేవ్‌ తదితరులు పాల్గొన్నారు. జిన్‌పింగ్‌ మాట్లాడుతూ డిజిటల్‌ కరెన్సీకి సంబంధించి సహకారాన్ని పెంచుకోవాలని, ఎస్‌సీఓ అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయాభివృద్ధి పథకం అమలునకు అన్ని వర్గాలతో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందని అన్నారు. రక్షణ వాదం వద్దన్నారు. ఏకపక్షంగా ఆంక్షలు విధించడాన్ని మానుకోవాలని సూచించారు. ఆర్థికంగా కట్టడి చేసేందుకు జాతీయ భద్రతను అస్త్రంగా వాడటాన్ని వ్యతిరేకించాలన్నారు. గోడల నిర్మాణాన్ని అడ్డుకోవాలని, పరిశ్రమలు, సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించడం వంటివి సరికాదని హితవు పలికారు. పరస్పర ప్రయోజనాలపై దృష్టితో సహకారాన్ని బలపర్చుకోవాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ ఎస్‌సీఓ దేశాల బాధ్యతని జిన్‌పింగ్‌ నొక్కిచెప్పారు. పరస్పరం విశ్వాసాన్ని పెంచుకోవాలని హితవు పలికారు. తమ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు భాగస్వామి దేశాలకు అనుమతిచ్చేందుకు, తమ అభివృద్ధి అనుభవాన్ని పంచుకునేందుకు చైనా సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రాంతీయ శాంతి, భద్రతల పరిరక్షణకు కృషిచేయాలని, దేశాలు పరస్పరం సమాచారాన్ని, పరిజ్ఞానాన్ని పంచుకోవాలని, ప్రజాసంబంధాలు మెరుగవ్వాలని, ఆర్థిక పురోగతిలో ఎస్‌సీఓ సహకార గతి పెరగాలని జిన్‌పింగ్‌ సూచనలు చేశారు. బెల్ట్‌ ఆండ్‌ రోడ్‌ (బీఆర్‌ఐ) ప్రాజెక్టుకు సంబంధించి వివిధ దేశాలతో సహకారాన్ని పెంచుకోవడమే కాకుండా అభివృద్ధి వ్యూహాలు, ప్రాంతీయ సహకార పథకాలకు కసరత్తులు ఉమ్మడిగా జరగాలని పిలుపునిచ్చారు. శాంతి, సుస్థిరత, అభివృద్ధి విషయంలో పరస్పర ప్రయోజనాల దృష్ట్యా చర్యలు ఉన్నప్పుడు ఆ ప్రక్రియ ఆగబోదని జిన్‌పింగ్‌ నొక్కిచెప్పారు.వ్యూహాత్మక చర్చలు, సహకారాన్ని పెంపొందించుకోవాలని, పోటీని నివారించేందుకు సహకారాన్ని ప్రోత్సహించేలా భిన్నాభిప్రాయాల నివారణకు చర్చలు జరపాలని సూచించారు. పరస్పర ప్రయోజనాలను గౌరవించుకోవాలని, అభివృద్ధి సాధనకు సహకారించుకోవాలని ఎస్‌సీఓ దేశాలకు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎస్‌సీఓది కీలకపాత్ర : పుతిన్‌
అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎస్‌సీఓ కీలక పాత్ర పోషిస్తోందని, శాంతి సుస్థిరతల స్థాపనకు గణనీయమైన తోడ్పాటును అందిస్తోందని, తన సభ్యదేశాల సుస్థిర ఆర్థిక వృద్ధికి హామీనిస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు.
ఎస్‌సీఓ ఫ్రేమ్‌వర్క్‌ పరిధిలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపర్చేందుకు, తోడ్పాటును పెంచుకునేందుకు ప్రస్తుత ఎస్‌సీఓ కౌన్సిల్‌ ఆఫ్‌ హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌ రూపొందించిన నివేదికలు, నిర్ణయాల ప్యాకేజి ఎంతగానో దోహదమవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. బెలారస్‌ను ఎస్‌సీఓ చేర్చడానికి మద్దతిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img