Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రజాస్వామ్యానికి ముప్పు: బైడెన్‌

పారిస్‌: ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిరదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి ప్రమాదక పరిస్థితి నెలకొందని, ఇటువంటి కాలంలో మనం జీవిస్తున్నామని ఆయనన్నారు. 80ఏళ్ల కిందటగానీ ప్రస్తుతంగానీ ఏదేని దేశాన్ని ఒంటరి చేయడం ద్వారా ఏ సమస్యకు పరిష్కారం లభించదని చెప్పారు. తమ మిత్రపక్షాల పక్షాన్ని ఎప్పటికీ వదలమన్నారు. కూటములతోనే మనకు బలమన్నారు. దీనిని అమెరికన్లు ఎప్పటికీ మరువురాదని సూచించారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తామని, అలాగే అంతర్జాతీయ మిత్రపక్షాలకు తోడునీడగా ఉంటామని, ఎవరినీ ఒంటరిగా వదిలేయమని బైడెన్‌ సంకల్పించారు. నాటో వంటి సంస్థల ప్రాధాన్యతను ప్రశ్నిస్తూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యల క్రమంలో బైడెన్‌ మాటలకు ప్రాధాన్యత ఏర్పడిరది. ఉక్రెయిన్‌ చుట్టుపక్కల దేశాలు… మొత్తం యూరప్‌ బెదిరింపులు తప్పవని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వైఖరిని ఉద్దేశించి బైడెన్‌ అన్నారు. నియంతలకు తలవంచే ఆలోచన కూడా రాకూడదని నొక్కిచెప్పారు. ఫ్రాన్స్‌లోని ఓంహా బీచ్‌లో నిర్వహించిన డీడే 80వ వార్షికోత్సవంలో బైడెన్‌ మాట్లాడారు. జెలెన్‌స్కీతో బైడెన్‌ ద్వైపాక్షిక భేటీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీతో జో బైడెన్‌ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించినట్లు శ్వేతసౌధం వెల్లడిరచింది. ఇంటర్‌ కాంటినెంటెల్‌ పారిస్‌ లే గ్రాండ్‌ హోటల్‌లో ఇద్దరు అధినేతలు భేటీ అయినట్లు తెలిపింది. ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న బైడెన్‌ పారిస్‌లో జెలెన్‌స్కీని కలిశారని... నార్మండీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రెండు దేశాల అధినేతలు ఫ్రాన్స్‌ వెళ్లారు. కీవ్‌ కోసం 225 బిలియన్‌ డాలర్ల ప్యాకేజిని బైడెన్‌ ప్రకటించే అవకాశమున్నట్లు శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌కు మిరేజ్‌ యుద్ధవిమానాలు: మాక్రాన్‌ ఉక్రెయిన్‌కు మిరేజ్‌ యుద్ధవిమానాలు సరఫరా చేస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్యానుయేల్‌ మాక్రాన్‌ తెలిపారు. ఉక్రెయిన్‌ సైనికులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. మిరేజ్‌ 20005ఎస్‌ యుద్ధ విమానాలను పంపుతామని, 4,500 మందితో కూడిన ఉక్రెయిన్‌ బెటాలియన్‌కు యుద్ధ తంత్రం నేర్పుతామన్నారు. తాము పంపే ఆయుధాలను పౌరులపై బాంబు దాడులు చేసేందుకు వినియోగించరన్న హామీనిచ్చారు. ఉక్రెయిన్‌కు సైనిక శిక్షకులను పంపుతామని కూడా చెప్పారు.
మా దళాలు పంపే
యోచన లేదు: నాటో చీఫ్‌
హెల్సింకి: ఉక్రెయిన్‌కు తమ దళాలను పంపే ఆలోచన లేదని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ స్పష్టంచేశారు. ఉక్రెయిన్‌కు మద్దతివ్వడం కోసం పటిష్ఠ కార్యాచరణను రూపొందిస్తునట్లు తెలిపారు. రష్యా నుంచి నాటో మిత్రదేశానికి ముప్పు లేదని, యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఎలాంటి ముప్పు ఉండబోదన్నారు. మరో యుద్ధానికి కౌంట్‌డౌన్‌ మొదలవుతుందన్నది తప్పుడు అంచనాగా తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img