Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

అవసరమైతే తాలిబన్లతో కలిసి పనిచేస్తాం : బోరిస్‌ జాన్సన్‌

లండన్‌ : అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసు కోవడంతో ఆ దేశం విషయంలో ప్రపంచ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. కొందరు సహకారాన్ని నిరాకరిస్తుంటే మరికొన్ని దేశాలు కలిసి పనిచేసేం దుకు సిద్ధమని ప్రకటిస్తున్నాయి. ఈ జాబితాలో చైనా, పాకిస్థాన్‌, రష్యా దేశాల సరసన బ్రిటన్‌ కూడా చేరింది. అఫ్గాన్‌లో సంక్షోభానికి పరిష్కారాన్ని చూప టానికి అవసరమైతే తాలిబన్లతో కలిసి పనిచేస్తామని జాన్సన్‌ ప్రకటించారు. అవసరమైతే రాజకీయ, దౌత్య చర్యలు చేపడతామని తెలిపారు. అఫ్గాన్‌ పరిస్థితు లను చక్కబెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రక టించారు. జాన్సన్‌ మాట్లాడుతూ అఫ్గానిస్థాన్‌ సంక్షో భానికి పరిష్కారాన్ని చూపటానికి సిద్ధంగా ఉన్నామని అవసరమైతే తాలిబన్లతో కలిసి పనిచేసి.. అఫ్గాన్‌ పరిస్థితులను చక్కబెడతామని అక్కడి ప్రజలకు భరోసా ఇవ్వాలనుకున్నామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కాబూల్‌ నుంచి ఇప్పటి వరకు 1,165 మందిని బ్రిటన్‌కు శనివారం తరలిం చినట్లు తెలిపారు. వీరిలో బ్రిటన్‌ పౌరులు 399 మంది కాగా రాయబార కార్యాలయ సిబ్బంది 320 మంది, అఫ్గాన్లు 402 మంది ఉన్నారని జాన్సన్‌ వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img