Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Thursday, October 3, 2024
Thursday, October 3, 2024

ఇజ్రాయిల్‌కు అమెరికా అండ

ఇరాన్‌ క్షిపణులను అడ్డుకోవడంలో సాయం

వాషింగ్టన్‌: పశ్చిమాసియాను మళ్లీ యుద్ధ మేఘాలు కమ్మేశాయి. హిజ్బుల్లా, హమాస్‌ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ ప్రతీకార చర్యలకు దిగింది. ఒక్క రాత్రిలో దాదాపు రెండు వందల బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకుపడిరది. వీటిలో చాలా వాటిని అమెరికా సాయంతో ఇజ్రాయిల్‌ అడ్డుకుంది. లెబనాన్‌లో ఇజ్రాయిల్‌ దాడులు ప్రారంభించిన నాటి నుంచి పశ్చిమాసియాలోని పరిస్థితులపై అమెరికా ప్రత్యేక దృష్టి పెట్టింది. నిత్యం అక్కడ ఏం జరుగుతుందనేది అధ్యక్షుడు జో బైడెన్‌ గమనిస్తూనే ఉన్నారు. ఇజ్రాయిల్‌పై దాడికి యత్నిస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అగ్రరాజ్యం హెచ్చరించింది. అయినప్పటికీ ఇరాన్‌ వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో సిచ్యువేషన్‌ గదిలో కూర్చున్న జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పశ్చిమాసియాలోని పరిస్థితులను ప్రతి క్షణం పర్యవేక్షించారు. ఇజ్రాయిల్‌కు సాయం చేయమని ఆయన అమెరికా మిలటరీకి ఆదేశాలు జారీ చేసినట్లు వైట్‌హౌస్‌ స్థానిక మీడియాకు వెల్లడిరచింది. ఇరాన్‌ దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా అమెరికాకు సమాచారం అందింది. ఈ ఏడాది ప్రారంభంలో టెహ్రాన్‌ చేసిన దాడి కంటే ఇప్పుడు జరగబోయేది పెద్దదంటూ ఇజ్రాయిల్‌ను హెచ్చరించింది. రాబోయే 12 గంటల్లో దాడి జరగొచ్చని అప్రమత్తం చేసింది. దాడికి ముందు తూర్పు మధ్యధరా ప్రాంతంలో యూఎస్‌ఎస్‌ కోల్‌, బుల్కెలీ అనే రెండు అర్లీ బర్క్‌- క్లాస్‌ డెస్ట్రాయర్లు అమెరికా మోహరించి ఉంది. ఇరాన్‌ దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయిల్‌- అమెరికా దళాలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయిల్‌పైకి ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులను అడ్డుకునేందుకు అమెరికా డజన్ల కొద్ది ఇంటర్‌సెప్టర్స్‌ను పంపించిందని పెంటగాన్‌ ప్రతినిధి ఒకరు వెల్లడిరచారు. అమెరికా అడ్డుకోవడంతో ఇజ్రాయిల్‌ భూతలంలో తక్కువ నష్టం జరిగినట్లు తెలిపారు. ముఖ్యంగా ఐడీఎఫ్‌తో టచ్‌లో ఉంటూ ఇరాన్‌ కుట్రను ఎప్పటికప్పుడు గమనిస్తూ దాడులను తిప్పికొట్టినట్లు వివరించారు.
ఇజ్రాయిల్‌పై ఇరాన్‌
క్షిపణుల వర్షం…
ఇజ్రాయిల్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ మంగళవారం రాత్రి వందలకొద్దీ బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. వీటిలో ఒకటి ఇజ్రాయిల్‌ రాజధాని టెల్‌అవీవ్‌లోని మొస్సాద్‌ ప్రధాన కార్యాలయం సమీపంలో పడిరది. దీంతో ఆ ప్రాంతంలో భారీ గుంత ఏర్పడిరది. క్షిపణి పడిన సమయంలో పెద్దఎత్తున దుమ్ము రేగడంతో అంతకుముందు అక్కడ పార్క్‌ చేసిన వాహనాలన్నీ మట్టిలో కూరుకుపోయినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిరచాయి. ఈ గుంతకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. హిజ్బుల్లాలోని కీలక ప్రాంతాల్లో ఐడీఎఫ్‌ దళాలు భీకర దాడులు చేసిన తర్వాత.. ఆ దేశంపై ఇరాన్‌ ప్రత్యక్ష దాడికి దిగింది. ఇరాన్‌ దాడితో అప్రమత్తమైన అయిన ఇజ్రాయిల్‌.. దేశ ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సైరన్ల మోత మోగింది. ఇజ్రాయిల్‌పై క్షిపణుల ప్రయోగం అనంతరం ఇరాన్‌ స్పందించింది. అక్కడి పౌరులనుద్దేశించి ఈ దాడులు చేయలేదని… చనిపోయిన హమాస్‌ అధినేత ఇస్మాయెల్‌ హనీయా, హిజ్బుల్లా చీఫ్‌ సయ్యద్‌ హసన్‌ నస్రల్లా, నిల్పోరూషన్‌ మరణానికి ప్రతీకారంగా ఈ దాడులు చేపట్టినట్లు అధికారికంగా ప్రకటించింది.
ఇరాన్‌కు నెతన్యాహు హెచ్చరిక
ఇరాన్‌ దాడుల తర్వాత ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఈ దాడికి టెహ్రాన్‌ కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img