Sunday, May 12, 2024
Sunday, May 12, 2024

ఉక్రెయిన్‌ దాడిని తిప్పికొట్టాం: రష్యా

మాస్కో: ఉక్రెయిన్‌ దాడిని తిప్పికొట్టామని రష్యా ప్రకటించింది. డొనెట్స్‌లో ఉక్రెయిన్‌ జరిపిన భారీ దాడిని అడ్డుకోవడంతో పాటు ఆ దేశానికి 250 మంది సైనికులను హతమార్చామని, అనేక సాయుధ వాహనాలను ధ్వంసం చేశామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. ఈ మేరకు యుద్ధం జరుగుతున్న వీడియోను విడుదల చేసింది. అందులో సైనిక వాహనాలు పొలాల్లో భారీగా కాల్పులు జరుపుతున్నట్లు కనిపిస్తోంది. అయితే రష్యా ప్రకటనను ఉక్రెయిన్‌ సైన్యం ధృవీకరించలేదు. రష్యా కావాలనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించింది. చాలాకాలంగా ఎదురుదాడి చేసేందుకు ఉక్రెయిన్‌ ఎదురుచూస్తోంది. కాగా ముందస్తు హెచ్చరిక ఇవ్వబోమని సైన్యం పేర్కొంది. అయితే ఊహించిన ట్లుగానే ఉక్రెయిన్‌ దాడి ప్రారంభమై ఉండవచ్చని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆరు మెకనైజ్డ్‌ ,రెండు ట్యాంక్‌ బెటాలియన్లను ఉపయోగించి ఉక్రెయిన్‌ ఆదివారం డోనెట్స్‌ ప్రాంతంలో పెద్ద ఎత్తున దాడి ప్రారంభించిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉక్రెయిన్‌ బలగాలు రష్యన్‌ రక్షణను ఛేదించడానికి ప్రయత్నించి విఫలమయ్యారని పేర్కొంది. ఉక్రెయిన్‌ 250 మంది సైనికులతో పాటు 16 ట్యాంకులను కోల్పోయిందని వెల్లడిరచింది. కాగా తమ ఆపరేషన్లకు ఆందోళన చెందిన రష్యా… తమ సమాచార, మానసిక కార్యకలాపాలను తీవ్రతరం చేస్తోందని ఉక్రెయిన్‌ సైప్యం పేర్కొంది. ఉక్రెయిన్‌ నెలల తరబడి రష్యాపై ఎదురుదాడికి ప్లాన్‌ చేస్తోంది. కానీ సైనికులకు శిక్షణ ఇవ్వడానికి , పాశ్చాత్య మిత్రుల నుంచి సైనిక సామగ్రిని స్వీకరించడానికి వీలైనంత ఎక్కువ సమయం కావాలని కోరింది. అయితే దాడిపై బహిరంగ ఊహాగానాలకు వ్యతిరేకంగా కీవ్‌లోని అధికారులు స్పందించారు. ఇది శత్రువులకు సహాయపడుతుందని చెప్పారు. ‘ప్రణాళికలు నిశ్శబ్దాన్ని ప్రేమిస్తాయి. ప్రారంభానికి సంబంధించిన ప్రకటన ఉండదు’ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం టెలిగ్రామ్‌కు పోస్ట్‌ చేసిన వీడియోలో తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img