Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

బ్రెజిల్‌లో పెరిగిన బాలకార్మికులు

బ్రసీలియా : బ్రెజిల్‌లో బాల కార్మికుల సంఖ్య దాదాపు రెండు మిలియన్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికుల సంఖ్య 8 మిలియన్ల నుండి 160 మిలియన్లకు పెరిగింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ. ఐక్యరాజ్యసమితి బాలల నిధి నివేదిక ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 160 మిలియన్ల మంది పిల్లలు, యువత కార్మికులుగా భారం మోస్తున్నారు. వీరిలో 2016 2020 మధ్య కాలంలో 8.4 మిలియన్ల మంది బాల కార్మికులుగా నమోదయ్యారు. బ్రెజిల్‌లో 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్కుల పిల్లల్లో 1.8 మిలియన్లమంది బాలకార్మికుల స్థితికి చేరుకున్నారు. 15 సంవత్సరాలలోపు పిల్లల అక్రమ రవాణా మూడు రెట్లు పెరిగింది. జాతీయ జనాభాలో పిల్లలు 54శాతం (213 మిలియన్లకు పైగా) ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ నల్ల జాతీయులు 66శాతం మంది ఉన్నారు. 45.9 శాతం పిల్లలు వయసుకు మించిన కఠినమైన వృత్తుల్లో ఉన్నారు. వ్యవసాయ యంత్రాలు, పొగాకు, చెరకు ప్రాసెసింగ్‌, కలప వెలకితీత, కత్తిరించడం వంటి కార్యకలాపాలు సాగిస్తున్నారు. పిల్లలు వీటికి బహిర్గతం కావడంతో పిల్లల్లో కేన్సర్‌, వినికడిలోపం, గాయాలు, మానసిక వ్యాధులు, కండరాల నొప్పులకు గురవుతున్నారు. పెరుగుతున్న పేదరికం బ్రెజిల్‌ జనాభాల్లో 12.9 శాతం నుండి 20.8 శాతం పేదరికంలో మగ్గుతున్నారు. పేదరి కంలో 7.9శాతం పెరుగుదల నమోదైందని తాజా అధ్యయనం వెల్లడిరచింది. దారిద్య్ర రేఖకు దిగు వన ఉన్న వారి సంఖ్య 4.1పాయింట్లు పెరి గింది. 20192021 మధ్య కాలంలో అత్యంత పేదరికంలో కూరుకుపోతున్న భూభాగంగా బ్రెజిల్‌ నమోదైంది. ప్రపంచబ్యాంకు నివేదిక ఆధారంగా రోజుకు 5.50 డాలర్ల అదాయం కలిగిన వ్యక్తిని పేదరికంలో ఉన్నట్లు పరిగణిస్తారు తీవ్ర పేదరికం అంటే రోజుకు 1.90 డాలర్ల ఆదాయం ఉంటే.. బ్రెజిల్‌ పేద ప్రజల సంఖ్య 25.2 శాతం నుంచి 29.5 శాతానికి పెరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img