Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

మెక్సికోను వణికించిన భూకంపం


మెక్సికోసిటీ: మెక్సికోను భారీ భూకంపం వణికించింది. గురువారం తెల్లవారుజామున మెక్సికోలోని ఓక్సాకా ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంపం తీవ్రత 5.7గా నమోదైనట్లు యూరోపియన్‌ మెడిటరేనియన్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌ (ఈఎంఎస్‌సీ) తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు ఈఎంఎస్‌సీ వెల్లడిరచింది. అయితే ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం అందలేదు. కాగా, ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లనుంచి బయటకి పరుగులు తీశారు.
అఫ్గాన్‌లోనూ…
అఫ్గానిస్థాన్‌లోని ఫైజాబాద్‌ సమీపంలో గురువారం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. ఫైజాబాద్‌కు 267 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడిరచింది. తెల్లవారుజామున భూకంపం రావడంతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img