Friday, May 3, 2024
Friday, May 3, 2024

రష్యా వద్దు… చైనా ముద్దు

మధ్య ఆసియా దేశాలకు జిన్‌పింగ్‌ పిలుపు
నేడు చైనామధ్య ఆసియా దేశాధినేతల సదస్సు బీజింగ్‌: విద్య, భాష, రాజకీయాలు ఇలా ఏ రంగమైనా సరే రష్యాపై కాకుండా చైనాపై ఆధారపడే విధంగా మధ్య ఆసియా దేశాలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నిమగ్నమయ్యారు. మధ్య ఆసియా దేశాధినేతలతో జిన్‌పింగ్‌ గురువారం, శుక్రవారం (ఈనెల 18,19 తేదీల్లో) జియాన్‌లో జరగబోయే చైనాసెంట్రల్‌ ఏషియా సదస్సులో భేటీ కానున్నారు. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉండరు. మధ్య ఆసియా దేశాలైన కజకిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, కిర్గిస్తాన్‌, తజికిస్తాన్‌, తుర్కమెనిస్తాన్‌ ప్రతినిధులకు జిన్‌పింగ్‌ ఆతిథ్యమిస్తున్నారు. చైనా, మధ్య ఆసియా దేశాల మధ్య సంబంధాల కోసం కొత్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించే లక్ష్యంతో ఈ సదస్సు జరుగుతోంది. జిన్‌పింగ్‌ ఇటీవల మధ్య ఆసియా దేశాల అధినేతలతో వారి వారి దేశాలతో కలిశారు. అయితే వీరంతా తొలిసారి చైనాలో పర్యటిస్తున్నారు. గతంలో ఇలాంటి సదస్సులకు పుతిన్‌ హాజరు తప్పనిసరిగా ఉండేది కానీ ఇప్పుడు చైనా ఆయనను పూర్తిగా విస్మరిస్తున్నది. రష్యా నుంచి మధ్య ఆసియా దేశాలను చైనా వైపునకు మళ్లించేందుకు జిన్‌పింగ్‌ ప్రయత్నిస్తున్నారు. కజకస్తాన్‌, కిర్గిస్తాన్‌, తిజికిస్తాన్‌ దేశాలు చైనాతో సరిహద్దులను పంచుకుంటుండటంతో వాయువ్య చైనా సుస్థిరత మధ్య ఆసియాలో సుస్థితరతో ముడిపడి ఉన్నది. మధ్య ఆసియా దేశాల విద్యార్థులకు చైనా స్కాలర్‌షిప్పులిస్తోంది. చైనామధ్య ఆసియా దేశాల బంధంతో విద్యార్థులకు మేలు జరిగిందని జిన్‌పింగ్‌ వెల్లడిరచారు. ఈ మేరకు జిన్హువా వార్తాసంస్థ నివేదించింది. సుమారు 20వేల మంది మధ్య ఆసియా దేశాల విద్యార్థులు చైనాలో చదువుకుంటున్నారు. జియాన్‌లోని పాలిటెక్నికల్‌ యూనివర్సిటీలో మధ్య ఆసియా దేశాల విద్యార్థులకు ఉచిత ట్యూషన్‌, బసతో పాటు నెలకు 1800 యువాన్‌ల స్టైఫెండ్‌, అంతర్జాతీయ ప్రయాణానికీ స్టైఫెండ్‌ ఇస్తారు. బీజింగ్‌లోని ప్రముఖ వర్సిటీలు మెరుగైన స్కాలర్‌షిప్పులు అందిస్తాయి. పాత ‘రష్యా ఫీవర్‌’ స్థానాన్ని ‘చైనా ఫీవర్‌’తో భర్తీ చేసేందుకు మధ్యఆసియా ప్రాంతంలో మాండరిన్‌ భాషను ప్రోత్సహించాలని బీజింగ్‌ కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img