Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

9/11 ఉగ్రదాడికి 20 ఏళ్లు….

ప్రపంచాన్ని చీకట్లో ముంచెత్తిన రోజు…

సెప్టెంబరు 11 ఉగ్రదాడి..చరిత్రలో ఇప్పటివరకు రికార్డు అయిన అతిపెద్ద ఉగ్రమారణహోమం. అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో మన్‌హటన్‌లోని 11ఎకరాల విస్తీర్ణంలో నెలకొన్న వరల్ట్‌ ట్రేడ్‌ సెంటర్‌ జంట భవనాలపై అల్‌ఖైదా ఉగ్రవాదలు దాడిచేశారు. ఈ దాడుల్లో సుమారు 4వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మారణహోమానికి 20ఏళ్లు పూర్తయినప్పటికీ జరిగిన కీలక పరిణామాలను మరచిపోలేకపోతున్నారు. తామే దాడిచేసామని ఆల్‌ఖైదా ప్రకటించింది.
ప్రధాన కారణాలు : ఆ సమయంలో ఇజ్రాయిల్‌తో అమెరికా స్నేహహస్తం, సొమాలియా, మోరో అంతర్యుద్ధం, రష్యా, లెబనాన్‌, కశ్మీర్‌లలో హింసాత్మక ఘటనలను, ముస్లింలపై అణచివేత చర్యలు, ఇస్లాం వ్యతిరేక కుట్రలకు అమెరికా అభయహస్తం..సౌదీ అరేబియాపై అమెరికా భద్రతాదళాల మోహరింపు, ఇరాక్‌కు వ్యతిరేకంగా ఆంక్షల విధింపుతో అమెరికాపై అల్‌ఖైదా ఉగ్రదాడులకు పాల్పడిరది.
దాడులు జరిగిన నేపధ్యం
సెప్టెంబరు 11, 2001న నాలుగు విమానాలను ఆత్మాహుతి దాడి సభ్యులు పథకం ప్రకారం హైజాక్‌ చేసి దాడి చేశారు. అల్‌ఖైదా నాయకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ నేతృత్వంలో అమెరికాలో నాలుగుచోట్ల దాడులకు ప్రణాళిక వేశారు. 19 మంది ఉగ్రవాదులు నాలుగు జట్లుగా విడిపోయి ప్రఖ్యాత భవంతులపై దాడులకు పాల్పడ్డారు. మన్‌హటన్‌లోని ట్విన్‌ టవర్స్‌గా పిలిచే వాణిజ్య భవంతుల్లోకి రెండు విమానాలతో దాడి చేశారు. ఈ ప్రదేశంలో విమానంలోని ప్రయాణీకులు, ఉగ్రవాదులు కూలిన భవనాల కింద చిక్కుకుని మరణించారు. మొత్తం 2763 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25వేల మంది క్షతగాత్రులయ్యారు. అమెరికా చరిత్రలోనే ఇది అతి పెద్ద ఉగ్రవాద దాడిగా నమోదైంది. మరో విమానం యుఎస్‌ రాజధాని వాషింగ్టన్‌ డీసీకి వెలుపల ఉన్న పెంగటాన్‌ (అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం)ను ఢీ కొట్టింది. నాలుగో విమానం పెన్సిల్వేనియాలో కూలిపోయింది. ఈ విమానంలోని పౌరులు హైజాకర్లపై ఎదురుదాడి చేసి విఫలమయ్యారు. ఈ విమానంలో ప్రయాణీకులందరూ మృతి చెందారు.
అమెరికా ప్రతీకార దాడులు
దీనికి ప్రతీకారంగా అమెరికా అఫ్గాన్‌ సరిహద్దులపై 2001 అక్టోబరు 7న దాడులకు తెగబడిరది. హమీద్‌ కర్జాయ్‌ను దేశాధ్యక్షుడిగా నియమించింది. అఫ్గాన్‌ పాలనను తన చేతుల్లోకి తీసుకుంది. 20ఏళ్లపాటు అఫ్గాన్‌లో తన సైన్యంతో నియంత్రణ చర్యలు చేపట్టింది. దాడులు జరిగిన పదేళ్ల తర్వాత 2011లో అబ్బోటాబాద్‌ (పాక్‌) లో లాడెన్‌ను అమెరికా సైన్యం హతమార్చింది.
ప్రభుత్వ ప్రారంభోత్సవాలు రద్దు..
అఫ్గాన్‌లో తాలిబన్ల నూతన ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించాలని తలప్టె తర్వాత రద్దుచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనబోమని రష్యా ప్రకటించింది. ఈ మేరకు కతార్‌ పాలకులు ప్రభుత్వ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసుకోమని సూచించినట్లు సమాచారం. సెప్టెంబరు11న నిర్వహిస్తే అంతర్జాతీయ సమాజం నుంచి తాలిబన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకత పెరగవచ్చునని కతార్‌హెచ్చరించినట్లు సమాచారం. తాలిబన్‌ ప్రభుత్వానికి ప్రపంచ దేశాల గుర్తింపు లభించడం కష్టతరంగా మారొచ్చని కతార్‌ సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img