Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

మా జీతాలు పెంచండి

. మెరుగైన పని పరిస్థితులు కల్పించండి
. ఆ తర్వాతే వైద్యుల సంఖ్య పెంచడంపై దృష్టి పెట్టండి
. ద.కొరియా జూనియర్‌ డాక్టర్ల డిమాండ్‌ ` సమ్మె
. విధులు బహిష్కరించిన 10వేల మంది వైద్యులు

సియోల్‌: తమ జీతాలు పెంచాలని, తమకు మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని దక్షిణ కొరియాలోని జూనియన్‌ డాక్టర్లు డిమాండ్‌ చేశారు. వారం రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుండా దేశంలో వైద్యుల సంఖ్యను పెంచడం గురించి ఆలోచించడం సరైనది కాదని ఆక్షేపించారు. సుమారు 10వేల మంది జూనియర్‌ డాక్టర్లు తమ విధులను బహిష్కరించారు. దీంతో దేశంలో ఆరోగ్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. రోగులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. దేశంలో వైద్యుల కొరతను తీర్చేందుకు మరింత ఎక్కువ మందిని మెడికల్‌ స్కూల్‌లో చేర్పించుకోవాలని దక్షిణ కొరియా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వైద్యులు సమ్మెబాట పట్టారు. సోమవారం 9,006 మంది ట్రైనీ డాక్టర్లు విధులకు హాజరు కాలేదు. తమకు వేతనాలు పెంచాలని, మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. సీనియర్‌ వైద్యులు, ప్రైవేటు వైద్యులు తమ విధులను బహిష్కరించలేదు కానీ జూనియర్‌ వైద్యులకు సంఫీుభావంగా ర్యాలీలు నిర్వహించారు. మెడికల్‌ స్కూల్‌ కోటా పెంపుదల ఆలోచనపై వెనక్కు తగ్గాలని డిమాండ్‌ చేశారు. ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో వైద్యులను పెంచడం ద్వారా ఓట్లు దండుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందని కొందరు వైద్యులు ఆరోపించారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఈ ప్రణాళికపై చర్యలను వాయిదా వేయాలని ప్రభుత్వ అధికారులను సియోల్‌ నేషనల్‌ యూనివర్సిటీ మెడికల్‌ ఫ్రొఫెసర్లు ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.
29వ తేదీలోగా రాలేదో….
ఈనెల 29వ తేదీ లోగా విధులకు హాజరు కాకపోతే తీవ్ర పరిణామాలు తప్పబోవని జూనియర్‌ వైద్యులకు ప్రభుత్వం అల్టిమేటం ఇచ్చింది. ‘మీరు రోగుల పక్కన నిలిచినప్పుడు మీ స్వరం మరింత బిగ్గరగా, స్పష్టంగా వినిపిస్తోందని గుర్తుపెట్టుకోండి’ అని హితవు పలికింది. ఈనెల 29వ తేదీ నాటికి విధులకు హాజరైతే, ఇప్పటివరకు జరిగిన దానికి మిమ్మల్ని బాధ్యులుగా పరిగణించబోమని హామీనిచ్చింది. మార్చి ఒకటో తేదీలోగా విధులకు హాజరు కాని పక్షంలో సంబంధిత జూనియర్‌ డాక్టర్లపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని, మూడు నెలల పాటు మెడికల్‌ లైసెన్సు రద్దు చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img