Monday, April 22, 2024
Monday, April 22, 2024

పలస్తీనా ప్రధాని శతాయే రాజీనామా

గాజా: పలస్తీనా ప్రధానమంత్రి మొహమ్మద్‌ శతాయే తన పదవికి రాజీనామా చేశారు. గాజాతో పాటు వెస్ట్‌ బ్యాంకులో హింస తీవ్రతరమవుతోన్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచారు. ఈ మేరకు అధ్యక్షుడు మొహమూద్‌ అబ్బాస్‌కు రాజీనామా లేఖను అందించారు. గాజా పై ఇజ్రాయిల్‌ దురాక్రమణ… అనంతర పరిణామాలు, వెస్ట్‌బ్యాంక్‌, జెరుసలేంలలో హింసాత్మక ఘటనలు తీవ్రతరమైన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను అధ్యక్షుడికి అందజేసినట్లు ఆయన ప్రకటించారు. హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌ సాగిస్తోన్న పోరు ముగిసిన తర్వాత… ఇక్కడ రాజకీయ ఏర్పాట్ల గురించి పలస్తీనియన్లలో ఏకాభిప్రాయం ఏర్పడటానికి వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు శతాయే చెప్పారు. అయితే, రాజీనామా ఆమోదంపై అధ్యక్షుడి నుంచి ఇంకా ప్రకటన వెలువడలేదు. పలస్తీనా ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌ ఛైర్మన్‌గా ఉన్న మొహమ్మద్‌ ముస్తఫాను నూతన ప్రధానిగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. యుద్ధం ముగిసిన తర్వాత గాజా ప్రాంతాన్ని పాలించే రాజకీయ వ్యవస్థ నిర్మాణంపై ఇప్పటికే ప్రయత్నాలు మొదలైనట్లు సమాచారం. ఇందుకోసం పలస్తీనా అథారిటీని పునర్‌వ్యవస్థీకరించాలని అమెరికా భావిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై పలస్తీనా అధ్యక్షుడిపై అగ్రరాజ్యం నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. పలస్తీనా అథారిటీలో సంస్కరణలు చేపట్టాలంటే అనేక అడ్డంకులు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రధాని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img