Friday, October 25, 2024
Friday, October 25, 2024

ప్రతికూల రాజకీయ పరిస్థితుల్లోనూ బలంగా ముందుకు: పీసీటీఈ

మాడ్రిడ్‌: రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ గతంలో కంటే మెరుగైన ప్రదర్శనను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ది వర్కర్స్‌ ఆఫ్‌ స్పెయిన్‌ (పీసీటీఈ) ఇచ్చింది. ఓట్లను పెంచుకుంది. 2019తో పోల్చితే ఈసారి ఎన్నికలలో 73.52శాతం ఎక్కువ ఓట్లు సాధించింది. గత మేలో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ ఈ పార్టీకి ఓట్లు పెరిగాయి. స్పెయిన్‌ సార్వత్రిక ఎన్నికలు ఈనెల 23న జరిగాయి. పీపుల్స్‌ పార్టీ (పీపీ) 136 సీట్లు గెలచుకొని విజేతగా నిలిచింది. అయితే ఈ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో అధికారం ఏర్పాటుపై తర్జనభర్జన కొనసాగుతోంది. 2019 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో కంటే అదనంగా 47 స్థానాలను పీపీ దక్కించుకోగలింగిది. సోషలిస్ట్‌ వర్కర్స్‌ పార్టీ (పీఎస్‌ఓఈ) 122 స్థానాలతో రెండోస్థానంలో నిలిచింది. వీఓఎక్స్‌ పార్టీ 33 స్థానాలకు పరిమితమైంది. గతసారి 52 స్థానాలలో గెలిచింది. సామాజిక ప్రజాస్వామిక కూటమి ‘సుమర్‌’ 31 స్థానాలను గెలచుకుంది. తాజా ఎన్నికల పరిణామాల నేపథ్యంలో పీసీటీసీ ఓ ప్రకటన చేసింది. గతంలో కంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వడం, మరింత బలంగా ముందుకు సాగుతుండటం సంతోషంగా ఉందని తెలిపింది. స్పానిష్‌ కేపిటలిజం వేర్వేరు రూపాలను దీటుగా ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. గత`ప్రస్తుత ఎన్నికల క్రమంలో తమకెంత లాభం పెరిగిందని కేపటలిస్టులు లెక్కలు వేసుకుంటుంటే ఎంత ఎక్కువ జనాదరణను పొందామని కమ్యూనిస్టు పార్టీ అంచనాలు వేసినట్లు ప్రకటన పేర్కొంది. ఓవైపు పెట్టుబడిదారీ వాదం బలపడగా మరోవైపు కార్మికులు, శ్రామిక జీవితాలు, పని పరిస్థితులు క్షీణించాయని తెలిపింది. పీపుల్స్‌ పార్టీ విజయం సాధించినప్పటికీ పూర్తిస్థాయిలో మెజారిటీని పొందలేకపోయిందని, తమ పార్టీ గతంలో కంటే మెరుగైన పరిణామాలను సాధించిందని కమ్యూనిస్టు పార్టీ ప్రకటన వెల్లడిరచింది. సామాజిక సంఘాలు బలోపేతమైతే శ్రామిక పోరాటాలు అంతే బలంగా సాగగలవని పేర్కొంది. వారికి మెరుగైన జీవితం, పని పరిస్థితులకు ఆస్కారం కలుగుతుందని ఆకాంక్షించింది. శ్రామికుల తరపున పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ కట్టుబడి ఉందని, కేపిటలిజం అంతానికి సంకల్పించిందని పేర్కొంది. ప్రజలు, శ్రామికుల తరపు ఉద్యమాలను మరింత ఉధృతం చేయనున్నట్లు పీసీటీపీ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img