Monday, September 25, 2023
Monday, September 25, 2023

అమెరికా పౌరసత్వం మరింత కఠినతరం.. పౌరసత్వం పొందేందుకు తొలిమెట్టయిన నేచురలైజేషన్ పరీక్షలో మార్పులు

అమెరికా పౌరసత్వం పొందడం ఇకపై మరింత కఠినతరం కానుంది. విదేశీయులకు పౌరసత్వం ఇచ్చేందుకు నిర్వహించే నేచురలైజేషన్ పరీక్షలో అమెరికా కీలక మార్పులు చేయనుంది. 2008లో చివరి సారిగా ఈ పరీక్షకు మార్పులు చేశారు. అమెరికా చట్టాల ప్రకారం ప్రతి 15 ఏళ్లకు ఓమారు ఈ పరీక్షకు కాలానికి అనుగుణంగా మార్పులు చేయాలి. దీంతో, మరోమారు పరీక్ష తీరులో మార్పులు చేర్పులకు రంగం సిద్ధమైంది. అభ్యర్థుల ఆంగ్లభాష నైపుణ్యాలను మదింపు వేసే ఈ పరీక్ష మరింత కఠినంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.అమెరికా పౌరసత్వ ప్రక్రియలో నేచురలైజేషన్ పరీక్ష తొలి అంకం. నెలరోజుల పాటు సాగే ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అమెరికాలో జీవితానికి సంబంధించి పలు ప్రశ్నలపై అభ్యర్థులు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img