Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

ఆకలి కోరల్లో చిక్కుకున్న అఫ్గాన్‌

పస్తుల్లో సగం మంది పౌరులు
కాబూల్‌ : అఫ్గాన్‌ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అహార సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. సుమారు 22.8 మిలియన్ల అఫ్గాన్‌లు ఆకలి కోరల్లో చిక్కుకున్నారు. పశ్చిమ కాబూల్‌లోని హజారా కమ్యూనిటీకి చెందిన 8 మంది చిన్నారులు ఆకలితో మృతి చెందారు. తాలిబన్లు అధికారంలోకి రావడంతో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా కుంటుపడ్డాయి. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం, పశువులపై ఆధారపడి జీవించే 7.3 మిలియన్ల ప్రజల జీవనోపాధిపై పెనుప్రభావం చూపింది. కోవిడ్‌`19 సంక్షోభం, అఫ్గాన్‌లో యుద్ధాలు, కఠినమైన శీతాకాలం కారణంగా తిండిదొరకక పస్తులుంటున్నారని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ సంక్షోభ నివారణకు తగిన చర్యలు చేపట్టక పోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఐరాస హెచ్చరించింది. ప్రాథమిక ఆహార అవసరాలు తీర్చడానికి, జీవనోపాధిని రక్షించడానకి మానవతా విపత్తు నివారణకు అత్యవసర మానవతా సహాయం అవసరమని తీర్మానించింది. రైతులు, మహిళలు, చిన్నారులు, వృద్ధుల్లో 37 శాతం దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తీవ్ర ప్రమాదంలో ఉన్నవారిలో 3.2 మిలియన్ల మంది ఐదేళ్లలోపు పిల్లలున్నారు. వారు సంవత్సరం చివరి నాటికి తీవ్ర పోషకాహార లోపంతో బాధపడతారని అంచనా.. గ్రామీణ ప్రాంతాలలో గత నాలుగేళ్లలో కరవు తీవ్ర ప్రభావాన్ని చూపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img