Friday, May 3, 2024
Friday, May 3, 2024

వియత్నాం ప్రధాన మంత్రిగా తిరిగి ఎన్నికైన ఫామ్‌ మిన్‌ చిన్హ్‌

హనోయ్‌ : వియత్నాం 15వ జాతీయ అసెంబ్లీ (ఎన్‌ఏ) ఫామ్‌ మిన్‌ చిన్హ్‌ను 2021`2026 పదవీ కాలానికి ప్రధానిగా తిరిగి ఎన్నుకుంది. 13వ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ వియత్నాం సెంట్రల్‌ కమిటీ (సీపీబీసీసీ) పొలిట్‌ బ్యూరో సభ్యుడు కూడా అయిన చిన్హ్‌ 15వ ఎన్‌ఏలో జరుగుతున్న మొదటి సెషన్‌లో 95.99 శాతం ఆమోదంతో తిరిగి ఎన్నికయ్యారు. దేశానికి, ప్రజలకు, సోషలిస్టు రిపబ్లిక్‌ ఆఫ్‌ వియత్నాం రాజ్యాంగానికి పూర్తిగా విధేయత చూపిస్తానని, సీపీవీ కేటాయించిన విధులను నిర్వర్తించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానని చిన్హ్‌ ప్రమాణ స్వీకారం సందర్బంగా ప్రతిజ్ఞ చేశారు. దేశంలో కొవిడ్‌ మహమ్మారి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం, భద్రతను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా చిన్హ్‌ పేర్కొన్నారు. తన మంత్రివర్గం కరోనా మహమ్మారి నియంత్రణకు టీకా కార్యక్రమాలు అమలు జరిగేలా చూస్తానని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img